Madhya Pradesh: పాపం.. ఆ రైతు పొర్లు దండాలు
ABN, Publish Date - Jul 17 , 2024 | 06:54 PM
తనకున్న కొద్ది భూమిని స్థానిక మాఫియా లాగేసుకుంది. తనకు జరిగిన అన్యాయాన్ని జిల్లా ఉన్నధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా.. వారు మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో అతడికి తోచలేదు. ఆ క్రమంలో ఇప్పుడు మనం ఏం చేయాలని ప్రశ్నించుకొంటూ రైతు కలెక్టర్‌లో పొర్లు దండాలు పెట్టడం ప్రారంభించాడు.
భోపాల్, జులై 17: తనకున్న కొద్ది భూమిని స్థానిక మాఫియా లాగేసుకుంది. తనకు జరిగిన అన్యాయాన్ని జిల్లా ఉన్నధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా.. వారు మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో ఆ రైతుకు తెలియలేదు. ఆ క్రమంలో ఇప్పుడు మనం ఏం చేయాలని ప్రశ్నించుకొంటూ సదరు రైతు కలెక్టర్‌లో పొర్లు దండాలు పెట్టడం ప్రారంభించాడు. దాంతో కలెక్టరేట్‌లోని సిబ్బందితోపాటు అక్కడికి వచ్చిన స్థానికులు సైతం పొర్లు దండాలు పెడుతున్న రైతును ఆసక్తిగా గమనించారు. అంతేకాదు.. ఆతడు ఆ విధంగా ఎందుకు చేస్తున్నాడంటూ అక్కడున్న వారిని ప్రశ్నించారు.
Also Read: Bengaluru: రైతును అవమానించిన మాల్ సిబ్బంది
అందుకు సంబంధించిన ఓ వీడియో.. మీడియాలో.. సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్ మాండసోర్ జిల్లాలో సుఖద్ గ్రామానికి చెందిన రైతు శంకర్ లాల్. అతడికి కొంత భూమి ఉంది. ఆ భూమిని స్థానిక భూ కబ్జాదారులు ఆక్రమించారు. ఈ అంశాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాడు. అయినా పలితం లేకుండా పోయింది. దీంతో శంకర్ లాల్ విసిగి వేసారి పోయాడు. ఇక చేసేది లేక.. కలెక్టర్ కార్యాలయంలో పొర్లు దండాలు చేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ దిలీప్ యాదవ్ స్పందించారు. రైతు భూమి ఆక్రమణ కేసును త్వరలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
Also Read: Uttar Pradesh: ఉప ఎన్నికల వేళ.. అగ్రనేతలు కీలక భేటీలు
రైతు శంకర్ లాల్ మాట్లాడుతూ.. లాండ్ మాఫియాతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తాశీల్దార్ చేసిన తప్పునకు.. రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం కారణంగా తాను పలుమార్లు ఇబ్బందులకు గురయ్యానని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రభుత్వంలో.. ఈ పాలనతో తాము సంతోషంగా లేనని కుండ బద్దలుకొట్టారు. అధికారులు అవినీతిలో మునిగిపోయారన్నారు. రైతులు మోసపోయారని... తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని శంకర్ లాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Also Read: Aadhaar number:‘ఆధార్ నెంబర్’ తో బ్యాంక్ ఖాతాలో సొమ్ము మాయం
Also Read: Maharashtra: అసెంబ్లీ ఎన్నికల వేళ.. అజిత్‌కి పెద్ద దెబ్బ
మరోవైపు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి.. సామాన్యడికి ఎలా.. ఎంతలా సహకరిస్తున్నాయనేందుకు ఈ వీడియో అసలు సిసలు ఉదాహరణ అని నెటిజన్లు ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 17 , 2024 | 07:29 PM