ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Wayanad landslide: వయనాడ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ

ABN, Publish Date - Aug 10 , 2024 | 02:45 PM

ప్రకృతి సృష్టించిన బీభత్సం కారణంగా వయనాడ్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ యా ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. తీవ్రంగా దెబ్బతిన్న పున్చిరిమట్టం, ముండక్కైతోపాటు చూరల్మల ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

తిరువనంతపురం, ఆగస్ట్ 10: ప్రకృతి సృష్టించిన బీభత్సం కారణంగా వయనాడ్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ యా ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. తీవ్రంగా దెబ్బతిన్న పున్చిరిమట్టం, ముండక్కైతోపాటు చూరల్మల ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ వెంట కేరళ సీఎం పినరయి విజయన్, కేరళ గవర్నర్ అరీఫ్ మహ్మమద్ ఖాన్, కేంద్ర పర్యాటక, పెట్రోలియం, సహాజ వాయువు శాఖల సహాయ మంత్రి సురేశ్ గోపి తదితరులు ఉన్నారు.

Also Read: Agniveers passing out parade: ‘అగ్నివీర్’పై భారత నేవీ చీఫ్ ప్రశంసల జల్లు


అనంతరం ప్రధాని మోదీ... భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిన ప్రాంతాల్లో రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు. విపత్తు సంభవించిన వివరాలను ఆయనకు అధికారులు వివరించారు. అలాగే ఈ ఘటనతో నిరాశ్రయులుగా మారి.. వివిధ పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నవారిని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని ప్రధాని మోదీ పరామర్శించే అవకాశం ఉంది.

Also Read: Manish Sisodia: ‘నిజాయితీకి ప్రతీక.. అరవింద్ కేజ్రీవాల్’


మరోవైపు ప్రధాని మోదీ వయనాడ్‌లో పర్యటిస్తున్నారు. అలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరామ్ రమేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. వయనాడ్‌లో 300 మందికి పైగా మరణించారు. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని మోదీ సర్కార్‌ను ఆయన డిమాండ్ చేశారు. అలాగే మణిపూర్‌లో సైతం ప్రధాని మోదీ పర్యటిస్తారని తన ఎక్స్ వేదికగా జైరామ్ రమేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Bangladesh Violance: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా..!


జులై 30న కేరళలోని వయనాడ్‌లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాల కురిశాయి. అలాగే వరద సైతం పోటెత్తింది. కొండ చరియలు భారీగా విరిగి పడ్డాయి. దీంతో 420 మందికిపైగా మరణించారు. అలాగే వందల మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు నేటికి కొనసాగుతున్నాయి. ప్రకృతి సృష్టించిన ఈ విలయంలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Also Read: Wayanad: ప్రముఖ నటుడు మోహన్ లాల్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యూట్యూబర్ అరెస్ట్


దాంతో వారంతా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ ప్రళయంలో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చోటు చేసుకున్నాయి. దీంతో జాతీయ విపత్తుగా ప్రకటించాలనే డిమాండ్ సర్వత్ర వ్యక్తమవుతుంది. మరి ప్రధాని మోదీ పర్యటన అనంతరం వయనాడ్ విపత్తును ఏ విధంగా పరిగణిస్తారనేది అంశంపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read: Kolkata doctor murder:వైద్య విద్యార్థి హత్య.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో వెలుగులోకి కీలక విషయాలు

Also Read: Manish Sisodia: భార్యతో సెల్ఫీ తీసుకుని.. తనదైన శైలిలో స్పందించిన మనీశ్

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 10 , 2024 | 02:58 PM

Advertising
Advertising
<