Lok Sabha Elections: మోదీ బాటలోనే...
ABN, Publish Date - Jun 01 , 2024 | 01:25 PM
తాము వీఐపీలం కాదని సామాన్య పౌరులమని గోరఖ్‌పూర్ ఎంపీ, ప్రముఖ నటుడు రవి కిషన్ స్పష్టం చేశారు. ఏడో దశ పోలింగ్‌లో భాగంగా శనివారం గోరఖ్‌పూర్‌లోని పోలింగ్ కేంద్రంలో.. ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి ఆయన సాధారణ పౌరుడిలా వచ్చి క్యూలో నిలబడి.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గోరఖ్‌పూర్, జూన్ 1: తాము వీఐపీలం కాదని సామాన్య పౌరులమని గోరఖ్‌పూర్ ఎంపీ, ప్రముఖ నటుడు రవి కిషన్ స్పష్టం చేశారు. ఏడో దశ పోలింగ్‌లో భాగంగా శనివారం గోరఖ్‌పూర్‌లోని పోలింగ్ కేంద్రంలో.. ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి ఆయన సాధారణ పౌరుడిలా వచ్చి క్యూలో నిలబడి.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Alos Read: ఏపీ ఎన్నికలపై ఫలితాలపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
అనంతరం రవికిషన్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు.. ప్రజలకు సేవకులని పేర్కొన్నారు. దేశంలో వివిఐపీ సంస్కృతికి ప్రధాని నరేంద్ర మోదీ పుల్ స్టాప్ పెట్టిన విషయాన్ని ఈ సందర్బంగా రవికిషన్ గుర్తు చేశారు. దేశ రాజకీయాలను ప్రధాని మోదీ పూర్తిగా మార్చేశారని చెప్పారు. వాటిని తామంతా అనుసరిస్తున్నామని ఈ సందర్బంగా రవి కిషన్ తెలిపారు. అయితే దేశంలో గతంలో కార్లపై ‘ఎర్ర బుగ్గ’ (రెడ్ లైట్) సంస్కృతికి సైతం ప్రధాని మోదీ నిలిపివేశారన్నారు.
Also Read: కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
భారత్ విశ్వగురు కావడం కోసం వికసిత భారత్, రామరాజ్యం, మేక్ ఇన్ ఇండియాకు మద్దతుగా ఓటు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఓటర్లకు రవి కిషన్ పిలుపు నిచ్చారు. మీ ఓటు.. దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఓటర్లు ఆయన సూచించారు.
Also Read: పోలింగ్ కేంద్రానికి దొంగలు..ఓటింగ్ పత్రాలు చోరీ, మెషీన్లు చెరువులో విసిరివేత
మరోవైపు ఈ ఎన్నికల వేళ.. గోరఖ్‌పూర్‌లో రవికిషన్‌కు మద్దతుగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం విధితమే. ఇప్పటికి రవికిషన్ గోరఖ్‌పూర్ నుంచి 5 సార్లు ఎంపీగా గెలుపొందారు. బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన రవి కిషన్‌కు ప్రత్యర్థులుగా సమాజవాదీ పార్టీ నుంచి కాజల్ నిషాద్, బీఎస్పీ నుంచి జావీద్ అషరఫ్ బరిలో నిలిచారు. అయితే గత ఎన్నికల్లో అంటే.. 2019 ఎన్నికల్లో రవికిషన్.. ఎస్పీ అభ్యర్థి రాంబుల నిషాద్‌పై 3 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిపొందిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లోని పలు చిత్రాల్లో ప్రతినాయకుడిగా రవి కిషన్ నటించిన విషయం విదితమే.
Also Read: లోక కల్యాణం కోసం వింత తపస్సు.. 21 అగ్ని గుండాల మధ్య భీకర వేడిలో కూర్చుని..
For Latest News and National News click here
Updated Date - Jun 01 , 2024 | 01:37 PM