Whatsapp: వాట్సాప్ అడ్మిన్ల జాబితా సేకరణలో పార్టీల నేతలు
ABN, Publish Date - Mar 31 , 2024 | 12:18 PM
వాట్సాప్ అడ్మిన్ల జాబితా సేకరణలో అన్ని పార్టీలు నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం సమాచారం చేరవేయడం, వీడియోలు, ఫొటోలు పంపించుకోవడంలో వాట్సాప్(Whatsapp) ప్రధాన పాత్ర పోషిస్తోంది.
చెన్నై: వాట్సాప్ అడ్మిన్ల జాబితా సేకరణలో అన్ని పార్టీలు నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం సమాచారం చేరవేయడం, వీడియోలు, ఫొటోలు పంపించుకోవడంలో వాట్సాప్(Whatsapp) ప్రధాన పాత్ర పోషిస్తోంది. కొందరు కుటుంబసభ్యులు, బంధువులతోను, మరికొందరు స్నేహితులు, ఒక్కో తరగతిలోని విద్యార్థులు, గ్రామాల్లో యువకుల వాట్సాప్ గ్రూపులున్నారు. అలాగే, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పారిశుధ్య కార్మికులు కూడా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని సమాచారం చేరవేసుకుంటున్నారు. ఈ విధానం పసిగట్టిన డీఎంకే, గత శాసనసభ ఎన్నికల్లో వాట్సాప్ అడ్మిన్ల జాబితా సేకరించి, వారి ద్వారా గ్రూపుల్లో డీఎంకేకు సంబంధించిన వార్తలు, మేనిఫెస్టో, ప్రచారం తదితరాలు పంపించగా మంచి ఫలితం ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్న పార్టీలు, వాట్సాప్ అడ్మిన్ల వివరాలు సేకరించి, వారితో మాట్లాడి, ఆయా గ్రూపుల్లో తమ తమ పార్టీల ప్రచారానికి సంబంధించి వార్తలు పంపించాలని నిర్ణయించారు. దీంతో, గ్రామస్థాయి నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు వారి వారి పరిధిలోని వాట్సాప్ గ్రూప్స్ అడ్మిన్ల వివరాలు సేకరించాలని పార్టీ అధిష్ఠానాలు కోరినట్లు సమాచారం.
Updated Date - Mar 31 , 2024 | 12:18 PM