ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి ప్రత్యక్షం!

ABN, Publish Date - Nov 18 , 2024 | 04:08 AM

గుజరాత్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చనిపోయాడనుకున్న వ్యక్తి తన సంస్మరణ కార్యక్రమం జరుగుతుండగా తిరిగి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

  • తన సంస్మరణ కార్యక్రమానికి హాజరు!

అహ్మదాబాద్‌, నవంబరు 17 : గుజరాత్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చనిపోయాడనుకున్న వ్యక్తి తన సంస్మరణ కార్యక్రమం జరుగుతుండగా తిరిగి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అహ్మదాబాద్‌లోని నరోదా ప్రాంతంలో బ్రిజేశ్‌ సుతార్‌(43) అనే వ్యక్తి అక్టోబరు 27 నుంచి కనిపించకుండాపోయాడు. కుటుంబసభ్యులు అతడి కోసం గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం నవంబరు 10న సబర్మతి బ్రిడ్జి దగ్గర ఓ మృతదేహం కనిపించింది. పోలీసులు బ్రిజేశ్‌ కుటుంబసభ్యులను పిలిపించి బాగా పాడైన ఆ మృతదేహాన్ని గుర్తుపట్టాల్సిందిగా కోరారు. బ్రిజేశ్‌ని పోలి ఉన్న ఆ మృతదేహాన్ని చూసి తమవాడేనని భావించారు అతడి కుటుంబసభ్యులు. ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి.. శుక్రవారం అతడి సంస్మరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సరిగ్గా ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడే బ్రిజేశ్‌ తిరిగి వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. పోలీసులు బాగా ఉబ్బిపోయిన మృతదేహాన్ని తమకు చూపగా తమవాడే అనుకుని అంత్యక్రియలు చేశామని అతడి తల్లి వాపోయింది. కాగా బ్రిజేశ్‌ మానసిక సమస్యలతోపాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడని సమాచారం. అతడు తిరిగి రావడంతో చనిపోయిన వ్యక్తి ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అతడి వివరాల కోసం పోలీసులు విచారణ ప్రారంభించారు.

Updated Date - Nov 18 , 2024 | 04:08 AM