Yaduveer Wadiyar: బీజేపీ రెండో జాబితాలో స్థానం సాధించిన మైసూరు కింగ్ యదువీర్ వడియార్ ఎవరు? ఆయన చరిత్ర ఏంటి?
ABN, Publish Date - Mar 14 , 2024 | 06:17 PM
లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) కోసం బీజేపీ (BJP) ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన రెండు జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసింది. మొదటి జాబితాలో (BJP First List) 195 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత 74 మందితో కూడిన రెండో జాబితాను (BJP Second List) రిలీజ్ చేసింది. అయితే.. ఈసారి కొందరు సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టేసి, కొత్త వారికి అవకాశం కల్పించింది.
లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) కోసం బీజేపీ (BJP) ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన రెండు జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసింది. మొదటి జాబితాలో (BJP First List) 195 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత 74 మందితో కూడిన రెండో జాబితాను (BJP Second List) రిలీజ్ చేసింది. అయితే.. ఈసారి కొందరు సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టేసి, కొత్త వారికి అవకాశం కల్పించింది. అలాంటి అభ్యర్థుల్లో మైసూరు రాజ వంశీయుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ (Yaduveer Krishnadatta Chamaraja Wadiyar) ఒకరు. సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహా (MP Pratap Simha) స్థానంలో బీజేపీ ఆయనను మైసూర్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో.. రాజకీయ వర్గాల్లో యదువీర్ పేరు చర్చనీయాంశంగా మారింది. పదండి.. ఆయన ఎవరు? చరిత్ర ఏంటి? అనేది ఈ వార్తలో తెలుసుకుందాం.
యదువీర్ వడయార్ చరిత్ర
అమెరికాలో చదువుకున్న 31 ఏళ్ల యదువీర్ వడయార్ పట్టాభిషేకం.. 2015 మే 28వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. ఆయన వడియార్ రాజవంశానికి 27వ రాజు. 2013లో మహారాజు శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ (Srikantadatta Narasimharaja Wadiyar) మృతి చెందిన తర్వాత.. ఆయన సతీమణి ప్రమోదాదేవి వడియార్ (Pramoda Devi Wadiyar) తమకు పిల్లలు లేకపోవడంతో యదువీర్ గోపాల్ రాజ్‌ను (Yaduveer Gopal Raj) దత్తత తీసుకున్నారు. అప్పుడు ఆయనకు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్‌గా నామకరణం చేశారు. గిటార్, సరస్వతీ వీణ వాయించడాన్ని ఆస్వాదించే యదువీర్.. అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్, ఇంగ్లీషులో బీఏ పూర్తి చేశారు.
చరిత్రపై ఆసక్తి కలిగి ఉన్న యదువీర్.. టెన్నిస్, గుర్రపు పందేలు అంటే ఎంతో ఇష్టం. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ రాజ కుటుంబానికి చెందిన త్రిషికా కుమారి వడియార్‌ను (Trishika Kumari Wadiyar) యదువీర్ వివాహం చేసుకున్నారు. మైసూరు రాజకుటుంబానికి రాజకీయాలు కొత్తేమీ కాదు. మునుపటి రాజు శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ మైసూరు పార్లమెంట్ నియోజకవర్గానికి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు. అయితే.. ఒకసారి ఓడిపోయారు. శ్రీకాంఠదత్త ఎక్కువకాలం కాంగ్రెస్ పార్టీలోనూ, కొద్దికాలం పాటు బీజేపీతోనూ ఉన్నారు. శ్రీకంఠదత్త తండ్రి జయచామరాజేంద్ర వడియార్ స్వాతంత్ర్యం తర్వాత గవర్నర్‌గా ఉన్నారు. యదువీర్ భార్య త్రిషిక తండ్రి హర్షవర్ధన్ సింగ్ సైతం గతంలో బీజేపీ రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించారు.
కాంగ్రెస్‌కి బీజేపీ స్ట్రోక్
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని ఉద్దేశంతో.. గెలుపు అవకాశాలున్న అభ్యర్థులనే రంగంలోకి దింపాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే.. సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాని కాదని, మైసూర్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి యదువీర్‌ను అభ్యర్థిగా రంగంలోకి దింపింది. పాత మైసూరు ప్రాంతంలో (దక్షిణ కర్ణాటక) ఈ రాజకుటుంబానికి ఇప్పటికీ ఎంతో గౌరవం ఉంది. ఫలితంగా.. ఆయనపై కాంగ్రెస్ (Congress) విమర్శలు చేయడానికి వీలు లేదు. ఒకవేళ విమర్శిస్తే.. అవి తమకే బ్యాక్‌ఫైర్ అవుతాయి. దీనికితోడు.. యదువీర్ గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - Mar 14 , 2024 | 06:17 PM