National Politics: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తారా.. అసలు విషయం తెలుసుకోండి..
ABN, Publish Date - Nov 26 , 2024 | 03:51 PM
ఓవైపు నవంబర్ 26లోపు శాసనసభ గడువు ముగుస్తుందని, ఈలోపు సీఎం ప్రమాణ స్వీకారం తప్పనిసరనే ప్రచారం జరుగుతోంది. కొత్త సీఎం నవంబర్ 26లోపు ప్రమాణ స్వీకారం చేయకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో నవంబర్ 26లోపు సీఎం ప్రమాణ స్వీకారం తప్పనిసరి కాదని..
మహారాష్ట్రలో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కలిసిన మహాయుతి కూటమి శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీ సాధించింది. అయినప్పటికీ కూటమి నుంచి సీఎంగా ఎవరుంటారనే ఉత్కంఠ ఇంకా వీడలేదు. ఓవైపు నవంబర్ 26లోపు శాసనసభ గడువు ముగుస్తుందని, ఈలోపు సీఎం ప్రమాణ స్వీకారం తప్పనిసరనే ప్రచారం జరుగుతోంది. కొత్త సీఎం నవంబర్ 26లోపు ప్రమాణ స్వీకారం చేయకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో నవంబర్ 26లోపు సీఎం ప్రమాణ స్వీకారం తప్పనిసరి కాదని, కొత్త ప్రభుత్వం కొలువుదీరకపోయినా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గత అనుభవాలను ఉదాహరణగా పేర్కొంటూ.. గతంలో శాసనసభ గడువు తీరిన తర్వాత ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ లెక్కలో నవంబర్ 26లోపు సీఎం ప్రమాణ స్వీకారం చేయకపోయినా, కొత్త ప్రభుత్వం కొలువుదీరకపోయినా రాష్ట్రపతి పాలన విధించే ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది.
నవంబరు 26లోపు..
మహారాష్ట్రలో నవంబర్ 26 లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం తప్పనిసరి కాదని శాసనసభ వ్యవహారాలపై అవగాహన ఉన్న వ్యక్తులు, న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియడంతో, నవంబర్ 26లోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కచ్చితమైన నిబంధన రాజ్యాంగంలో లేదని చెబుతున్నారు.
గతంలో..
అసెంబ్లీ పదవీకాలం ముగిసిన తర్వాత మహారాష్ట్రలో సీఎంలు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మహారాష్ట్ర 10వ అసెంబ్లీ పదవీకాలం 2004 అక్టోబర్ 19న ముగియగా.. 11వ అసెంబ్లీకి కొత్త సీఎం 2004 నవంబర్ 1న ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 11వ శాసనసభ పదవీకాలం 2009 నవంబర్3వ తేదీన ముగియగా 12వ శాసనసభకు కొత్త సీఎం 2009 నవంబర్ 7వ తేదీన ప్రమాణం చేశారు. 12వ అసెంబ్లీ పదవీకాలం 2014 నవంబర్ 8తో ముగియగా, 13వ అసెంబ్లీకి కొత్త సీఎం 2014 అక్టోబర్ 31న ప్రమాణ స్వీకారం చేశారు. 13వ అసెంబ్లీ పదవీకాలం 2019 నవంబర్ 9తో ముగియగా 14వ అసెంబ్లీకి కొత్త సీఎం 2019 నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే నవంబర్ 26లోపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయకపోయినా రాష్ట్రపతి పాలన రాదనే విషయం సుష్పష్టమవుతోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here
Updated Date - Nov 26 , 2024 | 03:51 PM