Wine Shops: మద్యంషాపులకు పోటెత్తిన మందుబాబులు..
ABN, Publish Date - Apr 21 , 2024 | 11:13 AM
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల సెలవుల తర్వాత శనివారం తెరుచుకున్న టాస్మాక్ మద్యం దుకాణాలకు(Tasmac Wine Shops) మందుబాబులు పోటెత్తారు.
- మూడు రోజుల తర్వాత తెరుచుకున్న దుకాణాలు
చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల సెలవుల తర్వాత శనివారం తెరుచుకున్న టాస్మాక్ మద్యం దుకాణాలకు(Tasmac Wine Shops) మందుబాబులు పోటెత్తారు. ఆదివారం మహావీర్ జయంతి సందర్భంగా మళ్ళీ మద్యం దుకాణాలు మూతపడనుండటంతో మద్యం కొనుగోలుకు దుకాణాల వద్ద వందల సంఖ్యలో జనం గుమికూడారు. ఆదివారం కోసం రెట్టింపుగా మద్యం సీసాలు కొనుగోలు చేశారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ నెల 17,18,19 తేదీలు మద్యం దుకాణాలు మూసివేశారు. శనివారం మధ్యాహ్నం పలుచోట్ల మద్యం దుకాణాలు తెరవక ముందే మందుబాబులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. దుకాణాలు తెరిచినవెంటనే ఒకరికొకరు పోటీపడుతూ బ్రాందీ, విస్కీ, బీరు(Brandy, whiskey, beer) కొనుగోలు చేశారు. అదే సమయంలో మూడు రోజులు మద్యానికి దూరమైనవారంతా శనివారం మద్యం దుకాణాల వద్దే తాగారు.
ఇదికూడా చదవండి: శక్తిమంతులంతా ఏకమైంది నన్ను దించడానికే
మత్తు కాస్త తగ్గాక ఆదివారం కోసం మరికొన్ని మద్యం సీసాలు కొని ఇళ్ళకు బయలుదేరారు. రాష్ట్రమంతటా మద్యం దుకాణాల వద్ద ఈ దృశ్యాలే కనిపించాయి. శనివారం మద్యం విక్రయాలు అధికంగా ఉంటాయని ముందుగానే గ్రహించిన టాస్మాక్ అధికారులు శుక్రవారం రాత్రే దుకాణాలకు రెట్టింపు స్టాకు మద్యం సరఫరా చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మూడు రోజుల సెలవుల ప్రభావంతో మంగళవారం ఒకే రోజు రాష్ట్రమంతటా రూ.400 కోట్ల మేరకు మద్యాన్ని విక్రయించిన విషయం తెలిసిందే. ఆ రీతిలోనే శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అంతే మొత్తంలో మద్యం విక్రయాలు జరిగే అవకాశం ఉందని టాస్మాక్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ మద్యం దుకాణాలన్నీ మందుబాబులతోనే కిటకిటలాడాయి.
ఇదికూడా చదవండి: Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి...
dr
Updated Date - Apr 21 , 2024 | 11:13 AM