ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Women: మహిళను కొడుతుండగా వీడియో

ABN, Publish Date - Jun 22 , 2024 | 10:30 AM

దేశంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. రోజు ఎక్కడో చోట దాడులకు గురవుతూనే ఉన్నారు. చిన్న చిన్న కారణాలకే గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. కొన్ని సందర్భాల్లో దాడికి సంబంధించి వీడియోలు తీస్తున్నారే తప్ప.. కొట్టడాన్ని మాత్రం ఆపడం లేదు. మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

women beat

ఏం జరిగిందంటే..?

ధార్ జిల్లా తండా ప్రాంతంలో ఓ మహిళను కొందరు విచక్షణరహితంగా కొడుతున్నారు. పక్కన ఉన్న కొందరు ఆపేందుకు కూడా ప్రయత్నించడం లేదు. పైగా మొబైల్ పట్టుకొని వీడియో తీశారు. ఆ మహిళ ఏం చేసిందో తెలియదు. కానీ విచక్షణరహితంగా కొట్టారు. అక్కడ ఉన్న వారికి ఆ మహిళను చూసి ఏ మాత్రం జాలి వేయలేదు. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. పోలీసులు వెంటనే స్పందించారు.

సూత్రధారి అరెస్ట్..!!

మహిళపై దాడి చేసిన ప్రధాన సూత్రధారి నర్సింగ్ అని, అతను గంధ్వానీలో గల కోక్రికి చెందిన వాడని ధార్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ వివరించారు. దాడి చేసిన మిగతా వారిని పట్టుకునే పనిలో తమ బృందాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రమంత్రి సావిత్రి థాకూర్ స్వగ్రామంలో ఈ ఘటన జరిగింది. ఘటనపై ఇప్పటివరకు కేంద్రమంత్రి స్పందించలేదు. మహిళలపై జరుగుతోన్న దాడులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Updated Date - Jun 22 , 2024 | 10:30 AM

Advertising
Advertising