ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yogi Adityanath: తగ్గిన యోగి ప్రభ..

ABN, Publish Date - Aug 23 , 2024 | 09:40 PM

లోక్ సభ ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితులు లేవు. రాజకీయంగా పెను మార్పులు జరిగాయి. దేశంలో అత్యధిక జనాధరణ కలిగిన ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఇండియా టుడే వార్తా సంస్థ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చేపట్టింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు.

Yogi Adityanath

లక్నో: లోక్ సభ ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితులు లేవు. రాజకీయంగా పెను మార్పులు జరిగాయి. దేశంలో అత్యధిక జనాధరణ కలిగిన ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఇండియా టుడే వార్తా సంస్థ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చేపట్టింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించిన సమయంలో కూడా ఆయనే ఆగ్రస్థానంలో ఉన్నారు. కానీ ప్రజాధరణ మాత్రం తగ్గింది. ఏకంగా 18 శాతం ఆదరణను యోగి ఆదిత్యనాథ్ కోల్పోయారు.



తగ్గిన క్రేజీ..

30 రాష్ట్రాల్లో లక్ష 36 వేల 463 మంది అభిప్రాయం తీసుకొని ఇండియా టుడే వార్తా సంస్థ సర్వే చేపట్టింది. 33 శాతం మంది మాత్రమే యోగి ఆదిత్యనాథ్ బెస్ట్ సీఎం అని ర్యాంక్ ఇచ్చేశారు. అయినప్పటికీ యోగి టాప్ ప్లేస్‌లో నిలిచారు. రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (13.8) పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ 9.1 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. 4.7 శాతంతో తమిళనాడు సీఎం స్టాలిన్ నాలుగో స్థానం.. 4.6 స్థానంతో ఏపీ సీఎం చంద్రబాబు ఐదో స్థానంలో ఉన్నారు.



పాలనపై ఓకే..

ఫిబ్రవరి నెలలో మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చేపట్టింది. ఆ సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు 51 శాతం బెస్ట్ సీఎం అని అభిప్రాయ పడ్డారు. ఆగస్ట్ నెలలో మాత్రం 33 శాతానికి పడిపోయింది. అంటే 18 శాతం మంది ఆదరణ కోల్పోయారు. ఆదిత్యనాథ్ పాలనపై 47 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నారు. ఈ ఒక్క అంశం బీజేపీ శ్రేణులకు ఊరట కలిగిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఆశించిన స్థాయిలో బీజేపీ సీట్లు దక్కించుకోలేదు. కేవలం 33 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఇండియా కూటమి క్రమంగా బలపడింది. 43 సీట్లు కైవసం చేసుకుని సత్తా చాటింది.


Read More
National News
and Latest Telugu News

Updated Date - Aug 23 , 2024 | 09:40 PM

Advertising
Advertising
<