ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM YOGI: ఉమ్మేసిన తందూరి రోటీలు.. తీవ్రంగా స్పందించిన యోగి సర్కార్

ABN, Publish Date - Oct 23 , 2024 | 05:19 PM

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆహారంలో ఉమ్మివేయడం లేదా ఉమ్మి కలిపిన ఆహారాన్ని వడ్డించడం వంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకునేలా కీలక సమావేశం నిర్వహించింది.

CM Yogi Adithyanath

లక్నో: ఉమ్మి వేస్తూ తందూరి రోటీలు తయారు చేస్తున్న దాబా ఓనర్ ఉదంతంపై తాజాగా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీలో ఇలాంటి ఘటనలు ఎక్కువవుతుండటంతో అది యూపీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. తినే పదార్థాలను పాడు చేయడం, ఉమ్మి వేయడం వంటి ఘటనలు అధికంగా యూపీ నుంచే నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది.


కొత్త ఆర్డినెన్స్ తో అడ్డుకట్ట..

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆహారంలో ఉమ్మివేయడం లేదా ఉమ్మి కలిపిన ఆహారాన్ని వడ్డించడం వంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకునేలా కీలక సమావేశం నిర్వహించింది. ఇటువంటి హానికర కార్యకలాపాలను నిరోధించేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్ ను తయారు చేయనుంది. ఉమ్మివేయడం నిషేధం ఆర్డినెన్స్ 2024' , 'యుపి ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ ఇన్ కాంటామినేషన్ (కన్సూమర్ రైట్ టు నో) ఆర్డినెన్స్ 2024' ను తీసుకురానుంది. సీఎం యోగి సంబంధిత అధికారులతో పాటు హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్, ఆశిష్ సింగ్ (హోం శాఖ), సంజీవ్ గుప్తా తో సమావేశమయ్యారు.


ఆహారంపై పూర్తి సమాచారం

ఈ ఆర్డినెన్స్‌ల ద్వారా ఉమ్మివేసి తయారు చేసే ఆహారం సప్లై చేసేవారిపై కఠినమైన నిబంధనలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో పాటు ప్రతి వినియోగదారుడు తన ఆహారం గురించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉండేలా చేస్తుంది. అంటే ఆహారం ఎక్కడ తయారు చేయబడింది, ఎవరు తయారు చేస్తున్నారు మొదలైనవి తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.


వైరలైన వీడియోలో దాబాలో పనిచేస్తున్న ఓ వ్యక్తి చకచకా తందూరి రోటీలు కాల్చుతూ కస్టమర్లకు అందిస్తున్నాడు. మధ్య మధ్యలో అందులో కాస్త ఉమ్మి దాన్ని కూడా పెనం మీద వేడి వేడిగా కాల్చి సప్లై చేసేస్తున్నాడు. పక్కన ఉన్న ఇంకో వ్యక్తి దీన్ని కళ్లారా చూస్తున్నా అతడిని వారించకపోగా ఇద్దరూ కలిసి పకపకా నవ్వుకుంటూ రాక్షసానందం పొందుతున్నారు.ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

Diwali 2024: దీపావళి ఏ రోజు? అక్టోబర్ 31 లేదా నవంబర్ 1?

Updated Date - Oct 23 , 2024 | 06:00 PM