ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Wayanad: ప్రముఖ నటుడు మోహన్ లాల్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యూట్యూబర్ అరెస్ట్

ABN, Publish Date - Aug 10 , 2024 | 08:36 AM

కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కొండ చరియలు విరిగి పడిన ప్రాంతంలో భారత సైన్యంతో కలిసి ఆర్మీ దుస్తులు ధరించి సహయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చెకుతాన్ యూట్యూబ్ చానెల్ నిర్వహకుడు అజు అలెక్స్.. మోహన్ లాల్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.

Actor Mohanlal

తిరువనంతపురం, ఆగస్ట్10: ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ (Mohanlal)పై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అజు అలెక్స్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కొండ చరియలు విరిగి పడిన ప్రాంతంలో భారత సైన్యంతో కలిసి ఆర్మీ దుస్తులు ధరించి సహయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చెకుతాన్ యూట్యూబ్ చానెల్ నిర్వహకుడు అజు అలెక్స్.. మోహన్ లాల్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.

Also Read: wayanad landslides: నేడు వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ

దాంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (Association of Malayalam Movie Artistes) (ఏఎంఎంఏ) ప్రధాన కార్యదర్శి, నటుడు సిద్దిఖి స్పందించారు. అజు అలెక్స్‌పై తిరువాళ్ల పోలీసుల (Thiruvalla Police)కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. అతడిని అరెస్ట్ చేశారు. అంతేకాదు.. మలయాళం సినిమా పరిశ్రమకు చెందిన వారిపై అజు అలెక్స్ తరచు విమర్శలు గుప్పిస్తారని సిద్దిఖి పేర్కొన్నారు.


టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌ హోదా...

ప్రకృతి సృష్టించిన విపత్తుతో కేరళలోని వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. దీంతో వందల మంది మరణిచారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. దీంతో భారత సైన్యంతో కలిసి నటుడు మోహన్ లాల్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 2009లో మోహన్‌లాల్‌కు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌ హోదా కల్పించారు.


అందులోభాగంగా ఆయన ఆర్మీ దుస్తులు ధరించిన సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బాధితుల పునరావాసం కోసం రూ. 3 కోట్లను విరాళంగా అందిస్తున్నట్లు మోహన్ లాల్ ప్రకటించారు. అయితే ఈ సహాయక చర్యల్లో పాల్గొన్న మోహన్‌లాల్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఇప్పటికే పర్యటించిన రాహుల్.. నేడు పర్యటించనున్న మోదీ..

జులై 30వ తేదీన కేరళలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరద పోటెత్తింది. ఆ క్రమంలో కొండ చరియలు సైతం విరిగి పడ్డాయి. చుర్మలల, ముండక్కి గ్రామాల్లో భారీగా ప్రజలు మరణించారు. ఇప్పటి వరకు 400 మందికిపైగా మృతి చెందారు. మరింత మంది గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు వయనాడ్‌లో పర్యటించనున్నారు.


ఇక లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతోపాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ సైతం ఇప్పటికే వయనాడ్‌లో విపత్తు సంభవించిన ప్రాంతాల్లో పర్యటించారు. అంతేకాదు.. వయనాడ్‌లో చోటు చేసుకున్న ఘటనను జాతీయ విపత్తుగా పరిగణించాలని లోక్‌సభ సాక్షిగా ప్రదాని మోదీని రాహుల్ డిమాండ్ చేసిన విషయం విధితమే. అలాగే దక్షిణాదికి చెందిన పలు రాష్ట్రాల్లోని ఎంపీలు సైతం ఇదే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 10 , 2024 | 08:38 AM

Advertising
Advertising
<