ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్‌బీఐలో 13,735 క్లర్క్‌ జాబ్స్‌

ABN, Publish Date - Dec 23 , 2024 | 06:14 AM

భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ) 13,735 క్లర్క్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఖాళీలు ఇవి....

  • హైదరాబాద్‌ సర్కిల్‌: 342

  • అమరావతి సర్కిల్‌: 50

  • చివరి తేదీ: 2025 జనవరి 7లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు చేసుకోవచ్చు.

  • పూర్తి వివరాల కోసం: టఛజీ.ఛిౌ.జీుఽ/ఠ్ఛీఛ/ఛ్చిట్ఛ్ఛటట/ఛిఠటట్ఛుఽ్టౌఞ్ఛుఽజీుఽజట వెబ్‌సైట్‌ చూడవచ్చు.

భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ) 13,735 క్లర్క్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఖాళీలు ఇవి.


హైదరాబాద్‌ సర్కిల్‌: 342, అమరావతి సర్కిల్‌: 50

వయస్సు: అభ్యర్థుల వయస్సు 2024 ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే 1996 ఏప్రిల్‌ 2 నుంచి 2004 ఏప్రిల్‌ 1వ తేదీ మధ్యలో జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ(జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు: ఏ విభాగంలో అయిన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు దరఖాస్తునకు అర్హులు. అలాగే ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, విజయవాడ/గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరంల్లో ఈ కేంద్రాలున్నాయి.

ప్రిలిమినరీ/ మెయిన్స్‌: ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష 2025 ఫిబ్రవరిలో, మెయిన్‌ పరీక్ష 2025 మార్చి/ ఏప్రిల్‌లో జరుగుతుంది.

ఎంపిక: ఈ పరీక్షలను ఆన్‌లైన్‌ మోడ్‌లో నిర్వహిస్తారు.


ప్రిలిమినరీ పరీక్ష: ప్రశ్న పత్రం మొత్తం వంద మార్కులకు ఉంటుంది. జవాబులను 60 నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో కూడా ఒక్కో విభాగానికి కేటాయించిన నిర్ణీత వ్యవధిలోనే సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఇందులో నెగెటీవ్‌ మార్కింగ్‌ ఉంటుంది. తప్పుగా జవాబు రాసిన ప్రతీ ప్రశ్నకు 1/4 మార్కును కట్‌ చేస్తారు. సుమారుగా ప్రతీ ఖాళీకి పదిమంది చొప్పున మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు.


మెయిన్‌ పరీక్ష: ఇందులో 200 మార్కులకు 190 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల 40 నిమిషాల్లో దీనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో కూడా నెగెటీవ్‌ మార్కింగ్‌ ఉంటుంది. తప్పుగా సమాధానం రాసిన ప్రతీ ప్రశ్నకు పావు మార్కు కోత విధిస్తారు.


ప్రిపరేషన్‌ టిప్స్‌ జనరల్‌

  • ప్రిపరేషన్‌ ప్రారంభించే ముందే సిలబస్‌, వెయిటేజీ పట్ల అవగాహన తెచ్చుకోవాలి. వెయిటేజ్‌ ఆధారంగా ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి.

  • ఎక్కువ సిలబస్‌ ఉన్న దృష్ట్యా సరైన ప్రణాళికను తయారు చేసుకోవాలి. మెయిటేజీ, కష్టాన్ని బట్టి ఆయా టాపిక్‌కు సమయాన్ని కేటాయించుకోవాలి.

  • నిర్ణీత సమయంలో సిలబస్‌ పూర్తయినప్పటికీ పునశ్చరణ అనేది క్రమం తప్పకుండాలి చేసుకోవాలి. దీంతో పరీక్షహాల్లో వేగంగా సమాధానాలు గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.

  • బ్యాంకింగ్‌ తదితర పరీక్షల్లో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ అనేది చాలా కీలకం. నిర్ణీత సమయంలో జవాబు పూర్తయ్యేలా కృషిచేయాలి. ఒక ప్రశ్నకు ఎక్కువ సమయం పడుతుందనుకుంటే వెంటనే దానిని వదిలేసి ఇంకోదానికి వెళ్లిపోవాలి. చివర్లో టైమ్‌ మిగిలితే దానిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి.

  • మాక్‌ టెస్ట్‌లు తప్పనిసరి. అభ్యర్థి బలాలు, బలహీనతలు దీనితో బయట పడతాయి. తప్పులు కనిష్టస్థాయిలో ఉండే విధంగా అభ్యర్థులు సిద్దం కాగలుగుతారు.


ఇంగ్లీషు

  • జూ ఇంగ్లిషు సిలబస్‌ ఇటీవల కాలంలో చాలా మారింది. అందుకే నిర్లక్ష్యం చేయొద్దు.

  • జూ రెనిన్‌ మార్టిన్‌ బుక్‌ నుంచి గ్రామర్‌ రూల్స్‌ను నేర్చుకోవాలి. ఉదాహరణల ఆధారంగా వాటిని నేర్చుకోవాలి.

  • జూ ఇంగ్లిషు ఆర్టికల్స్‌ రోజు చదవాలి. కొత్త పదాలు రాసుకోవాలి. తరచుగా పునశ్చరణ చేసుకోవాలి.

  • జూ క్లోజ్‌ టెస్ట్‌, పిల్లర్స్‌, సెంటెన్స్‌ కరెక్షన్‌, స్పాటింగ్‌ ఎర్రర్స్‌ చాప్టర్లను ప్రాక్టీసు చేయాలి.

రీజనింగ్‌

జూ బేసిక్‌ కాన్సెప్టులు అర్థం అయితే ఈ సెక్షన్‌ సులువు.

జూ పరీక్షలో వచ్చే అవకాశం ఉన్న పజిల్‌ మోడల్స్‌ రోజు రెండు మూడు పూర్తి చేయాలి.

జూ ఇన్‌ ఈక్వాలిటీ, ఆర్డర్‌ అండ్‌ ర్యాంకింగ్‌, కోడింగ్‌ అండ్‌ డీ కోడింగ్‌, డైరెక్షన్‌ డిస్టెన్స్‌, రక్ల సంబంధాలు చాప్టర్లు ప్రాక్టీసు చేయాలి.


క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌

  • స్వ్కేర్స్‌, క్యూబ్స్‌, టేబుల్స్‌ బట్టిపట్టాలి.

  • పరీక్షలో కాలిక్యులేషన్స్‌ వేగంగా చేయడానికి వేదిక్‌ ట్రిక్స్‌ ప్రాక్టీసు చేయాలి.

  • బేసిక్‌ చాప్టర్లు అయిన నంబర్‌ సిరీస్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, యావరేజ్‌, రేషియో ప్రపోర్షన్స్‌, పర్సెంటేజీలు బాగా చూసుకోవాలి.

  • బార్‌ గ్రాఫిక్స్‌, టాబులర్‌ డిఐ తదితర డేటా ఇంట్రప్రిటేషన్‌ సెట్స్‌ ప్రాక్టీసు ముఖ్యం.

కరెంట్‌ అఫైర్స్‌

  • క్రమం తప్పకుండా పేపర్‌ చదవాలి. రెండుమూడు పత్రికల ఎడిటోరియల్‌ పేజీలు చూడాలి.

  • సీఎ్‌సఆర్‌ జీకే పుస్తకాలు ఫాలోకావాలి.

  • మనోరమ ఇయర్‌ బుక్‌ చదివితే మంచిది.

రిఫరెన్స్‌ పుస్తకాలు

  • క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌: ఎస్‌ చాంద్‌, ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌, అరుణ్‌ శర్మ, ఎంకె పాండే పుస్తకాలు చదవాలి.

  • ఇంగ్లీషు లాంగ్వేజ్‌: రెనిన్‌ మార్టిన్‌, అరిహం త్‌ పబ్లికేషన్స్‌, ఎస్‌.చాంద్‌ పుస్తకాలు మంచివి

  • జనరల్‌ అవేర్‌నెస్‌: మనోరమ ఇయర్‌ బుక్‌, సీఎ్‌స ఆర్‌ జీకే, దిన పత్రికలు

  • బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌: అరిహంత్‌ పబ్లికేషన్స్‌

Updated Date - Dec 23 , 2024 | 06:14 AM