ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Technology : జీపీఎస్‌ సామర్ధ్యాలతో ‘బౌల్ట్‌’ డాష్‌క్యామ్‌

ABN, Publish Date - Jun 22 , 2024 | 12:39 AM

బౌల్ట్‌ క్రూయిజ్‌ క్యామ్‌ ఎక్స్‌1 - జీపీఎస్‌ లాగింగ్‌ ఫీచర్‌తో అలాగే అది లేకుండా కూడా వచ్చింది. లాగింగ్‌ ఫీచర్‌తో వాహనం వేగం, లొకేషన్‌ను డ్రైవర్‌ ట్రాక్‌ చేయగలుగుతాడు.

బౌల్ట్‌ క్రూయిజ్‌ క్యామ్‌ ఎక్స్‌1 - జీపీఎస్‌ లాగింగ్‌ ఫీచర్‌తో అలాగే అది లేకుండా కూడా వచ్చింది. లాగింగ్‌ ఫీచర్‌తో వాహనం వేగం, లొకేషన్‌ను డ్రైవర్‌ ట్రాక్‌ చేయగలుగుతాడు. ఇండియాలో రెండు వేరియంట్లను విడుదల చేశారు. 108పీ కెమెరా, జీపీఎస్‌ లాగింగ్‌ సామర్థ్యాలు 360 డిగ్రీల రొటేటబుల్‌ డిజైన్‌ ఉన్నాయి. మొదటిదానిలో 2 - మెగా పిక్సల్‌ కెమెరా ఉంది. 170 డిగ్రీల వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ కారణంగా ఎక్కువ రోడ్డును కవర్‌ చేస్తుంది. దాంతో బ్లయిండ్‌ స్పాట్స్‌ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ముందే చెప్పినట్టు లొకేషన్‌, వేగాన్ని డ్రైవర్‌ ట్రాక్‌ చేయగలుగుతాడు. అలాగే దీన్ని స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్‌ చేసుకోవచ్చు. సంబంధిత యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్‌లో ఉన్నాయి. సదరు యాప్‌ రికార్డింగ్స్‌కు వీలుగా ఉంటుంది. రికార్డ్‌ అయినా మీడియాను సర్దుబాటు చేసే ఆర్గనైజ్డ్‌ గ్యాలరీ ఉంటుంది. వాహనంలో లైవ్‌ స్ట్రీమింగ్‌కు అవకాశం ఉంటుంది. ఇక రెండో దానిలో 360 డిగ్రీల రొటేషనల్‌ డిజైన్‌ ఉండటంలో డ్రైవర్‌ తన అవసరాలకు తగ్గట్టు అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. ఇన్‌బిల్ట్‌ జి-సెన్సర్‌ కారణంగా ప్రమాదాలను డిటెక్ట్‌ చేస్తుంది. ఎమర్జెన్సీ వీడియో రికార్డింగ్‌ సదుపాయం కూడా ఉంది. డ్యాష్‌క్యామ్‌కు అల్యూమినియం చాసిస్‌తో మన్నిక బాగుంటుంది. జీపీఎస్‌తో ఉన్నది రూ.3,999 కాగా లేనిది రూ.2,999కే లభిస్తుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, బౌల్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి వీటిని పొందవచ్చు.

Updated Date - Jun 22 , 2024 | 12:39 AM

Advertising
Advertising