ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Navya : ఫ్యూజన్‌ ఫ్యాషన్‌

ABN, Publish Date - May 22 , 2024 | 12:44 AM

సంప్రదాయ చీరకట్టు కచ్చితంగా అందంగానే ఉంటుంది. అయితే ఆధునికత ఉట్టిపడేలా కనిపించాలంటే ఫ్యూజన్‌ స్టైల్‌ శారీ ఎంచుకోవాలి.

ఫ్యాషన్‌

సంప్రదాయ చీరకట్టు కచ్చితంగా అందంగానే ఉంటుంది. అయితే ఆధునికత ఉట్టిపడేలా కనిపించాలంటే ఫ్యూజన్‌ స్టైల్‌ శారీ ఎంచుకోవాలి. ఈవినింగ్‌ పార్టీస్‌, ఈవెంట్స్‌లో వినూత్నంగా కనిపించడం కోసం నేటి యువతులు ఎంచుకున్న ఫ్యూజన్‌ శారీస్‌ మీద ఓ లుక్కేద్దామా?

రెండు స్టైల్స్‌ కలగలిపి....

ఒకే చీరలో రెండుకు మించిన స్టైల్స్‌ దాగి ఉంటే, అదే, ఫ్యూజన్‌ శారీ! చుడీదార్‌, ఘాగ్రా, జీన్స్‌... ఇలా వేర్వేరు దుస్తులను తలపించేలా, లేదా రెండు మూడు రకాల దుస్తులను కలగలిపినట్టు కనిపించేలా ఫ్యూజన్‌ శారీస్‌ను డిజైన్‌ చేసుకోవచ్చు. అందుకోసం కొంత సృజనాత్మకత, ఫ్యాషన్‌ పట్ల అవగాహన ఉంటే సరిపోతుంది.

హూందాగా కనిపిస్తూ...

స్వయంగా డిజైన్‌ చేయించుకోవడం నచ్చని వాళ్లు, రెడీమేడ్‌గా దొరికే ఫ్యూ జన్‌ శారీస్‌ను కూడా ఎంచుకోవచ్చు. అయితే అవి శరీరానికి నప్పేలా ఉండేలా చూసుకోవాలి. ఎబ్బెట్టుగా కనిపించకుండా, స్టైల్‌గా కనిపించే ఫ్యూజన్‌ శారీస్‌ నలుగురినీ ఆకట్టుకుంటాయి. ఈ చీర కట్టులో హూందాగా కనిపించాలంటే, ఆ స్టైల్‌ను అంతే గ్రేస్‌ఫుల్‌గా హ్యాండిల్‌ చేయగలగాలి. ప్రత్యేకంగా కనిపించాలనే కోరిక, కొత్తదనాన్ని స్వాగతించే స్వభావం కూడా అవసరమే!

యాక్సెసరీస్‌

హైహీల్స్‌, ఫ్యాషన్‌ జ్యువెలరీ ఫ్యూజన్‌ శారీస్‌తో కలిపి తప్పక దరించాలి. హెయిర్‌స్టైల్స్‌ నప్పేలా ఉండాలి. భిన్నంగా కనిపించడం కోసం కాంట్రాస్ట్‌ కలర్స్‌ ఎంచుకోవచ్చు. అయితే ఫ్యూజన్‌ శారీకి సెక్విన్లు, ఎంబ్రాయిడరీలు లాంటి హంగులు పనికి రావు. వీలైనంతవరకూ ప్లెయిన్‌ కలర్స్‌, కాంట్రాస్ట్‌ దుస్తుల మీదే దృష్టి పెట్టాలి.

Updated Date - May 22 , 2024 | 12:44 AM

Advertising
Advertising