ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పండుగ వేళ మురిపించే జుంకాలు

ABN, Publish Date - Oct 27 , 2024 | 05:05 AM

దీపావళి వచ్చేస్తోంది. పండుగ రోజున ప్రత్యేకంగా కనిపించాలని మహిళలంతా కోరుకొంటారు. ప్రత్యేకించి లక్ష్మీపూజకి చక్కని చీర, నగలతో ముస్తాబవుతారు.

దీపావళి వచ్చేస్తోంది. పండుగ రోజున ప్రత్యేకంగా కనిపించాలని మహిళలంతా కోరుకొంటారు. ప్రత్యేకించి లక్ష్మీపూజకి చక్కని చీర, నగలతో ముస్తాబవుతారు. చీరకు తగ్గట్టు జుంకాలు కూడా పెట్టుకుంటే ముఖం దేదీప్యమానంగా మెరిసిపోతుంది. పండుగ రోజున అలా మురిపించే జుంకాలు మీకోసం...

  • ముత్యాల జుంకాలు

తెల్లని ముత్యాలు వరుసగా పేర్చిన జుంకాలు, ఒక పెద్ద సైజు ముత్యం వేలాడేలా ఉండే బుట్టలు యువతులకు బాగా నప్పుతాయి. నీలం, గులాబీ, ఎరుపు వంటి ముదురు రంగు పట్టుచీరలు కట్టుకున్నపుడు ముత్యాల చోకర్‌తోపాటు వీటిని ధరిస్తే చాలా అందంగా కనిపిస్తారు. వెడల్పాటి గుండ్రని ముఖం ఉన్నవారికి ఇవి అద్భుతంగా సూటవుతాయి. కొంచెం ఛాయ తక్కువగా ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా వీటిని పెట్టుకోవచ్చు. సన్నని ముత్యాలతో కూడిన చెంపస్వరాలు అదనపు అందాన్నిస్తాయి.

  • చాంద్‌బాలీలు

గోల్డ్‌ బాల్స్‌ లేదా ముత్యాలు వేలాడేలా అర్థచంద్రాకారంలో రూపొందించిన చాంద్‌బాలీలను ఇష్టపడని మగువలు ఉండరు. ఇవి రెండు, మూడు వరసల్లో కూడా లభ్యవుతాయి. రంగు రంగుల బీడ్స్‌తో రూపొందించిన చాంద్‌బాలీలు అన్ని చీరలమీదికి సూటవుతాయి. కోలముఖం ఉన్నవారికి ఇవి ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

  • పోల్కీ డ్రాప్స్‌

వజ్రాలు, అమెరికన్‌ డైమండ్స్‌, పగడాలతో రూపొందించిన పోల్కీ డ్రాప్స్‌ మధ్య వయసు మహిళలకు బాగా నప్పుతాయి. చక్కగా కొప్పు పెట్టుకొని వీటిని ధరిస్తే హుందాగా కనిపిస్తారు.

  • టెంపుల్‌ జుంకాలు

ప్రస్తుతం టెంపుల్‌ జువెలరీకి అత్యధికంగా ఆదరణ ఉంది. దేవతా మూర్తులు, హంసలు, నెమళ్లు, లతలు, పూలతో రూపొందించిన పెద్ద సైజు బుట్టలు గ్రాండ్‌గా కనిపిస్తాయి. వీటికి ముత్యాలు, కెంపులు, పచ్చలు వేలాడేలా కూడా తయారు చేస్తున్నారు. ఈ జుంకాలు పట్టుచీరలమీద రిచ్‌లుక్‌ని ఇస్తాయి.

  • రెడ్‌ బీడ్‌ జుంకాలు

ఎరుపు రంగు బీడ్స్‌ అమర్చిన పెద్ద సైజు బుట్టలు అమ్మాయిలకు ఆకర్షణీయంగా ఉంటాయి. ముత్యాలు, కెంపులు కూడా చేర్చి రిచ్‌గా కనిపించేలా వీటిని రూపొందిస్తున్నారు. పండుగవేళ అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు జుంకాలు పెట్టుకోవడం శుభప్రదం.

Updated Date - Oct 27 , 2024 | 05:08 AM