Alia Bhatt's : సోదరుడి కోసం ఎంతకైనా తెగిస్తా..
ABN, Publish Date - Jun 23 , 2024 | 12:18 AM
బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జిగ్రా’. వసన్ బాలా దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఆర్చీస్’ ఫేమ్ వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషిస్తున్నారు.
బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జిగ్రా’. వసన్ బాలా దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఆర్చీస్’ ఫేమ్ వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన అలియా.. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు.
‘‘ఇందులో నా పాత్రే కాదు.. లుక్ కూడా చాలా భిన్నంగా ఉండబోతోంది. ఈ సినిమా సెట్స్‌లో ఉన్నప్పుడు అస్సలు టైమ్ తెలియలేదు. దీనిక్కారణం మా చిత్రబృందం. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో గుర్తుండిపోయే సంఘటనలు జరిగాయి. డైరెక్టర్ వసన్ బాలాతో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయన చాలా కూల్‌గా ఉంటారు. సెట్స్‌లో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయన రచనా శైలి, ఆలోచనలు అబ్బురపరుస్తాయి. ఇక వేదాంగ్ రైనా సినిమాలో నాకు సోదరుడిగా కనిపిస్తారు. సినిమాలో మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఆకట్టుకుంటుంది. సోదరుడి కోసం ఎంతకైనా తెగించే పాత్ర నాది’’ అని చెప్పారు. ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కావాల్సి ఉన్నా..ఆక్టోబరు 11కు వాయిదా పడింది.
Updated Date - Jun 23 , 2024 | 12:18 AM