ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Balcony Decoration : బాల్కనీ... డెకరేట్‌ చేసుకోండిలా...

ABN, Publish Date - Sep 28 , 2024 | 12:46 AM

నగరజీవులు ఇంట్లో కాసేపు సేదతీరాలంటే బాల్కనీయే దిక్కు. సాయంకాలం కాఫీ సిప్‌ చేసేందుకు అది కరెక్ట్‌ ప్లేస్‌. రాత్రుళ్లు ప్రశాంతంగా ఒక పుస్తకాన్ని చదువుకోవాలంటే దీనికంటే మంచి ప్రదేశం దొరకదు.

గరజీవులు ఇంట్లో కాసేపు సేదతీరాలంటే బాల్కనీయే దిక్కు. సాయంకాలం కాఫీ సిప్‌ చేసేందుకు అది కరెక్ట్‌ ప్లేస్‌. రాత్రుళ్లు ప్రశాంతంగా ఒక పుస్తకాన్ని చదువుకోవాలంటే దీనికంటే మంచి ప్రదేశం దొరకదు. మరి అలాంటి బాల్కనీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలంటే ప్లానింగ్‌ ఉండాలి. బాల్కనీ అలంకరణలో నిపుణులు సూచిస్తున్న సలహాలు ఇవి..

  • పూలకుండీలు, మొక్కలు: బాల్కనీ ఆకర్షణీయంగా కనిపించాలన్నా, కాసేపు సేదతీరేందుకు కూర్చోవాలని అనిపించాలన్నా పూలకుండీలు, మొక్కలతో అలంకరించుకోవాలి. మీ అభరుచికి తగినవిధంగా పూల మొక్కలను, తీగ మొక్కలను ఎంచుకోవచ్చు. అయితే వాటి అమరిక నీట్‌గా ఉండాలి. బాల్కనీలో ఉన్న కొద్దిపాటి స్థలాన్ని ఆక్రమించేదిగా ఉండకూడదు. స్థలం తక్కువగా ఉంటే కుండీలు వేలాడదీసుకోవచ్చు. షెల్ఫ్‌లు ఏర్పాటు చేసుకుని వాటిలో పూల కుండీలు అమర్చుకోవచ్చు. విస్తీర్ణాన్ని బట్టి స్టాండ్‌ను పెట్టుకోవచ్చు. రాత్రివేళ బాల్కనీ లుక్‌ ట్రెండీగా కనిపించాలంటే హ్యాంగింగ్‌ లైట్స్‌, ఫైరీ లైట్స్‌ అమర్చుకోవాలి. అయితే ఎక్కువ వెలుతురు ఉండకూడదు. డిమ్‌ లైటింగ్‌ ఉండాలి. అలా అమర్చుకుంటే రాత్రుళ్లు కాసేపు సేదతీరడానికి ఇంతకన్నా మంచి ప్రదేశం దొరకదు.

  • స్థలాన్ని బట్టి: బాల్కనీ విస్తీర్ణం పెద్దగా ఉంటే పర్వాలేదు. కానీ చిన్నగా ఉంటేనే సీటింగ్‌ ఏర్పాటుకు కాస్త ఇబ్బంది ఉంటుంది. అలాంటప్పుడు ఫోల్డబుల్‌ కుర్చీలు, టేబుళ్లను సెట్‌ చేసుకోవాలి. అనవసరమైన వస్తువులకు బాల్కనీలో చోటు ఇవ్వొద్దు. స్థలం ఎక్కువగా ఉంటే సోఫా ఏర్పాటు చేసుకుని రంగురంగుల దిండ్లు పెట్టుకుంటే రిలాక్స్‌ కావడానికి పర్‌ఫెక్ట్‌ ప్లేస్‌గా మారుతుంది. చిన్నక్యాబినెట్‌ పెట్టుకుంటే స్టోరేజ్‌ ప్లేస్‌గా ఉపయోగపడుతుంది. అదే సమయంలో కూర్చోవడానికి పనికొస్తుంది.


  • ఆర్ట్‌ వర్క్‌, ఫ్రేమ్స్‌: బాల్కనీ గోడలకు ఆర్ట్‌ వర్క్స్‌ని, ఫ్రేమ్స్‌ని వేలాడదీయడం ద్వారా ఆకర్షణీయంగా కనిపించేలా తీర్చిదిద్దుకోవచ్చు. ఆర్ట్‌ వర్క్‌ అందుబాటులో లేకపోతే మొజాయిక్‌ మిర్రర్స్‌ని పెట్టుకోవచ్చు. బాల్కనీ ఫ్లోరింగ్‌ మార్చుకోవడం ద్వారా న్యూ లుక్‌ను తీసుకురావచ్చు. గ్రాస్‌ మ్యాట్‌ ఏర్పాటు చేస్తే గ్రీనరీ లుక్‌ వస్తుంది. బాల్కనీ ప్రకృతికి దగ్గరగా ఉన్న అనుభూతిని అందించేలా ఉంటే బాగుంటుంది. లివింగ్‌రూమ్‌లో కన్నా బాల్కనీలో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడే వారైతే ఒక కాఫీ టేబుల్‌, కొన్ని కుషన్లు, క్యాండిల్స్‌లు లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. ఈ అలంకరణ వైబ్స్‌ని క్రియేట్‌ చేస్తుంది.

    బాల్కనీలో ఏర్పాటు చేసుకునే ఫర్నిచర్‌ వెదర్‌ప్రూఫ్‌ అయితే బాగుంటుంది. ఆకాశహర్మ్యాల్లో నివసిస్తున్నట్లయితే బాల్కనీలో నుంచి సిటీ వ్యూ చక్కగా ఉంటుంది. ఇలాంటి వారు బాల్కనీలో గ్లాస్‌ రెయిలింగ్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఫాల్స్‌ సీలింగ్‌ ఏర్పాటు చేసుకుంటే ఫ్యాన్‌, ఫోకస్‌ లైట్లు అమర్చుకోవచ్చు. వుడెన్‌ డిజైన్‌ ఎంచుకుంటే కాంటెంపరరీ లుక్‌ వస్తుంది. అభిరుచిని బట్టి వాల్‌ పెయింటింగ్స్‌ను వేసుకోవచ్చు. వేలాడే ఊయలను అమర్చుకున్నా సింప్లీ సూపర్బ్‌గా ఉంటుంది. స్థలం, అవసరాలను బట్టి ప్లానింగ్‌తో డెకరేట్‌ చేసుకుంటే సేదతీరడానికి పర్‌ఫెక్ట్‌ ప్లేస్‌గా ఉంటుంది.

Updated Date - Sep 28 , 2024 | 12:46 AM