ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Beauty Tips : ఈ మేకప్‌ రెయిన్‌ ప్రూఫ్‌

ABN, Publish Date - Aug 10 , 2024 | 03:03 AM

వర్షాలు కురిసేటప్పుడు మేకప్‌ చెదిరిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తేమకూ, చెమ్మకూ చెక్కుచెదరని మేకప్‌ మెలకువలు అలవరుచుకోవాలి. అందుకోసం ఇవిగో ఈ చిట్కాలు పాటించాలి.

మేకప్‌

వర్షాలు కురిసేటప్పుడు మేకప్‌ చెదిరిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తేమకూ, చెమ్మకూ చెక్కుచెదరని మేకప్‌ మెలకువలు అలవరుచుకోవాలి. అందుకోసం ఇవిగో ఈ చిట్కాలు పాటించాలి.

వాటర్‌ప్రూఫ్‌ ఇలా: వాటర్‌ప్రూఫ్‌, దీర్ఘకాల ఫార్ములాలను కలిగి ఉండే సౌందర్య సాధనాలను ఎంచుకోవాలి. ఇవి వాతావరణంలోని తేమకు, అకస్మాత్తుగా కురిసే వర్షానికీ చెక్కుచెదరకుండా ఉంటాయి. ఇందుకోసం వాటర్‌ప్రూఫ్‌ ఐలైనర్‌, మస్కారా, మ్యాట్‌ లిక్విడ్‌ లిప్‌స్టిక్స్‌ ఎంచుకోవాలి. చివర్లో మేక్‌పను లాక్‌ చేయడం కోసం సెట్టింగ్‌ స్ర్పే వాడుకోవాలి. బ్లాటింగ్‌ పేపర్లు, మ్యాటిఫ యింగ్‌ పౌడర్లు రోజంతా మేక్‌పను తాజాగా ఉంచుకోవడంలో సహాయపడతాయి

లిప్‌స్టిక్‌ లవ్లీగా: వర్షాకాలంలో క్రీమీ, గ్లాసీ లిప్‌స్టిక్‌ వాడకం మానేయాలి. లాంగద్‌ వేరింగ్‌, మ్యాటి లిక్విడ్‌ లిప్‌స్టిక్స్‌ ఎంచుకోవాలి. బోల్డ్‌గా, ముదురు రంగుల లిప్‌స్టిక్స్‌ ఈ కాలానికి సూటవుతాయి. ఎరుపు, బెర్రీ, డీప్‌ ప్లమ్‌ రంగులు ఈ కాలంలో చాలా బాగుంటాయి. ఇవి కారిపోవు. తేమతో కూడిన వాతావరణంలో వెలిసిపోకుండా ఉంటాయి.

మేకప్‌ ఇలా: వాటర్‌ప్రూఫ్‌, స్మడ్జ్‌ప్రూఫ్‌, లాంగ్‌ లాస్టింగ్‌ మేక్‌పలను ఈ కాలంలో ఎంచుకోవాలి. గాలిలో తేమకూ, చెమ్మకూ చెదిరిపోకుండా ఉండే క్రీమ్‌, జెల్‌ ఆధారిత సౌందర్య సాధనాలను ఎంచుకుంటే అవి చర్మానికి అంటిపెట్టుకుని ఉంటాయి. ఈ కాలంలో పౌడర్‌ ఆధారిత మేకప్‌ సామాగ్రికి దూరంగా ఉండాలి. బ్లష్‌ నుంచి ఐషాడో వరకూ క్రీమ్‌ బేస్‌డ్‌ ఉత్పత్తులనే వాడుకోవాలి.

Updated Date - Aug 10 , 2024 | 03:03 AM

Advertising
Advertising
<