ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : మొటిమలు తగ్గటం ఎలా?

ABN, Publish Date - Jun 27 , 2024 | 12:31 AM

చాలా మందికి ముఖంపై చిన్న మొటిమలు వస్తూ ఉంటాయి. అయితే చాలా సార్లు వీటికి కారణం తెలియదు. కారణం తెలియకుండా వీటి నివారణకు ప్రయత్నించటం కూడా సరికాదు.

చాలా మందికి ముఖంపై చిన్న మొటిమలు వస్తూ ఉంటాయి. అయితే చాలా సార్లు వీటికి కారణం తెలియదు. కారణం తెలియకుండా వీటి నివారణకు ప్రయత్నించటం కూడా సరికాదు. అందువల్ల ఈ మొటిమలు రావటానికి కారణాలేమిటో తెలుసుకుందాం.

రెండు రకాలు..

ముఖంపై వచ్చే మొటిమలు చర్మంపై ఉన్న రంధ్రాలు పూడుకుపోవటం వల్ల రావచ్చు. లేకపోతే హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినటం వల్ల కూడా రావచ్చు. చాలా సందర్భాలలో అమ్మాయిలలో రుతుస్రవం ప్రారంభమయిన సమయంలో హార్మోన్లలో వచ్చే తేడా వల్ల ఈ మొటిమలు వస్తాయి.

అయితే హార్మోన్ల సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు- ఆడ, మగ అనే తేడా లేకుండా ఈ పొక్కులు వచ్చే అవకాశముందంటున్నారు వైద్య నిపుణులు. ఈస్ట్రోజెన్‌, ప్రొజిస్టిరాయిన్‌, యాండ్రోజిన్‌ వంటి హార్మోన్లలో తేడా వచ్చినప్పుడు- శరీరంలో శీబం అనే రసాయన ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల చర్మంపై ఉన్న రంధ్రాలు పూడుకుపోతాయి. దీని వల్ల మొటిమలు ఏర్పడతాయి.

తేడా ఏమిటి?

చర్మ సంబంధ సమస్యల వల్ల వచ్చే మొటిమలు వెంటనే తగ్గిపోతాయి. ఇవి శరీరంలో ఏ ప్రాంతంలోనైనా రావచ్చు. ఆసాధారణంగా వీటి పై భాగంపై తెల్లని లేదా నల్లని బొడిపలు ఉంటాయి. కానీ హార్మోన్ల వల్ల వచ్చే మొటిమలు- ముఖం కింది భాగంలోను, గెడ్డం మీద, మెడ మీద ఏర్పడతాయి. వీటిని గోకితే మంట ఏర్పడుతుంది. ఇవి మామూలు క్రీముల వల్ల తగ్గిపోవు. వైద్యులు వీటి కోసం ప్రత్యేకమైన క్రీములను నిర్దేశిస్తారు.

చికిత్సలేమిటి?

టీ ట్రీ ఆయిల్‌:

టీ ట్రీ ఆయిల్‌ వల్ల మొటిమలు తగ్గుతాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వారం రోజులు రాసుకుంటే కొంత ఫలితం కనిపిస్తుంది.

అలోవీరా:

అలోవీరా వల్ల చర్మంపై ఉన్న దద్దుర్లు తగ్గుతాయి. చర్మం మెరుస్తుంది.

గ్రీన్‌ టీ:

గ్రీన్‌టీ డికాక్షన్‌ను రాయటం వల్ల చర్మంపై ఎరుపు తగ్గుతుంది.

Updated Date - Jun 27 , 2024 | 12:31 AM

Advertising
Advertising