ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : నారింజ తొక్కతో నాజూకు!

ABN, Publish Date - Jul 20 , 2024 | 05:35 AM

నారింజ పండ్లు తింటూ రుచిని ఆస్వాదిస్తారు. కానీ ఆ తొక్కతో ఏముందిలే అని ఏరి పారేస్తారు. మీకో విషయం తెలుసా.. నారింత తొక్కను ఎండబెట్టి పొడి చేసుకుంటే..

నారింజ పండ్లు తింటూ రుచిని ఆస్వాదిస్తారు. కానీ ఆ తొక్కతో ఏముందిలే అని ఏరి పారేస్తారు. మీకో విషయం తెలుసా.. నారింత తొక్కను ఎండబెట్టి పొడి చేసుకుంటే.. హాయిగా ఫేస్‌మా్‌స్కగానూ ఉపయోగించుకోవచ్చు. ఎ-విటమిన్‌, సి-విటమిన్‌ ఉండే నారింజ తొక్కల పొడితో నాజూగ్గానూ తయారు కావొచ్చిలా...

  • నారింజ పండ్లు తింటూ రుచిని ఆస్వాదిస్తారు. కానీ ఆ తొక్కతో ఏముందిలే అని ఏరి పారేస్తారు. మీకో విషయం తెలుసా.. నారింత తొక్కను ఎండబెట్టి పొడి చేసుకుంటే.. హాయిగా ఫేస్‌మా్‌స్కగానూ ఉపయోగించుకోవచ్చు. ఎ-విటమిన్‌, సి-విటమిన్‌ ఉండే నారింజ తొక్కల పొడితో నాజూగ్గానూ తయారు కావొచ్చిలా..

  • బౌల్‌లో టేబుల్‌ స్పూన్‌ నారింజ తొక్కల పొడితో పాటు టేబుల్‌ స్పూన్‌ పెరుగు వేసి చూర్ణం చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

  • టేబుల్‌ స్పూన్‌ ఆరెంజ్‌ పీల్‌ పొడిలోకి టీస్పూన్‌ తేనె, కొద్దిగా రోజ్‌వాటర్‌ కలిపి ముఖానికి పట్టించుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.

  • నారింజ తొక్క పొడిలోకి అంతే పరిమాణంలో సున్నిపిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టిస్తే మృతకణాలు తొలగిపోతాయి.

  • బౌల్‌లో టేబుల్‌ స్పూన్‌ ఆరెంజ్‌ పీల్‌ పొడిలో, టేబుల్‌ స్పూన్‌ కొబ్బరినూనె, టేబుల్‌ స్పూన్‌ పాలు కలిపి చూర్ణం చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత మంచి నీళ్లతో శుభ్రం చేసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి.

  • ముందుగా ఆరెంజ్‌ పీల్‌ పౌడర్‌ను టేబుల్‌ స్పూన్‌ తీసుకోవాలి. ఇందులో టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం కలిపి చూర్ణం చేయాలి. అవసరమైతే పేస్ట్‌కు తగినట్లు నిమ్మరసం వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే మచ్చలు మాయమవుతాయి.

  • బౌల్‌లో టేబుల్‌ స్పూన్‌ ఆరెంజ్‌ తొక్కల పొడిని తీసుకుని అందులో టీస్పూన్‌ చక్కెర, టీస్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ వేసి చూర్ణం చేసుకోవాలి. ఇది స్క్రబ్‌లా ఉపయోగపడుతుంది. చర్మం మీద స్క్రబ్‌లా అప్లయ్‌ చేసుకోవటం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

  • ఆరెంజ్‌ పీల్‌ పౌడర్‌ను నీళ్లతో కలిపి ముఖానికి పట్టించుకుంటే చాలు.. చర్మంలో నూనె శాతం తగ్గుతుంది. యువీ కిరణాల బారిన నుంచి రక్షించే గుణం ఈ పొడికి ఉంది. ఇందువల్ల వృద్ధాప్యఛాయలు త్వరగా దరిచేరవు.

Updated Date - Jul 20 , 2024 | 05:35 AM

Advertising
Advertising
<