Black Thread: నల్ల దారం కట్టుకోవడం మంచిదేనా.. శాస్త్రం ఏం చెబుతుంది?
ABN, Publish Date - Nov 09 , 2024 | 04:32 PM
చాలా మందికి కాలికి నల్ల దారం కట్టుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఇలా కట్టుకోవడం వల్ల చెడు దృష్టి నుంచి కాపాడతాయని ఎక్కువగా నమ్ముతారు. అయితే, కాలికి నల్ల దారం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
Black Thread: మన పెద్దలు పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉండడం కోసం ఎక్కువగా కాలికి నల్ల దారం కట్టేవాళ్ళు. నలుపు దారం లేదంటే వెంట్రుకలతో చేసిన దారం కడుతూ ఉంటారు. కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది. ఇవి చెడు దృష్టి నుంచి కాపాడుతుందని ఎక్కువగా నమ్ముతారు. అయితే, కాలికి నల్ల దారం కట్టుకుంటే సంతోషం, శ్రేయస్సును ఇస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు. కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా కాలికి నల్ల దారం కట్టుకోవచ్చు. కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? స్త్రీలు ఏ కాలికి ధరించాలి? పురుషులు ఏ కాలికి ధరించాలో అనే విషయాలను ఈ కథనంలో మనం తెలుసుకుందాం..
ప్రయోజనాలు:
నలుపు రంగు దారాన్ని చెడు దృష్టి నుంచి రక్షణ పొందటం కోసం ధరించాలి. ఏదైనా ప్రతికూల శక్తి ఇబ్బంది పెడుతున్నట్లయితే అటువంటి వ్యక్తులు పాదాలకు నల్ల దారం కట్టుకోవచ్చు. ప్రతికూల శక్తులు, హానికరమైన శక్తుల నుంచి కాలికి కట్టుకున్న నల్ల దారం రక్షణగా ఉండటమే కాకుండా అనుకూల శక్తిని ఇస్తుంది. నలుపు రంగు శని గ్రహాన్ని సూచిస్తుందని, శని దేవుడు మనల్ని రక్షిస్తాడని అంటారు. కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల ఆరోగ్యకరమైన శక్తి ప్రవాహాలు మానసిక, శారీరక ఆరోగ్యానికి తోడ్పడుతాయని జ్యోతిష్యులు అంటున్నారు.
వైద్య లక్షణాలు:
నల్ల దారం చికిత్స లక్షణాలను కలిగి ఉంటుందని, మానసిక, శారీరక వైద్యం రెండింటినీ కాలికి కట్టుకున్న నల్ల దారం సులభతరం చేస్తుందని శాస్త్రం చెబుతుంది. కాలికి నల్లదారాన్ని ధరించడం వల్ల సహజంగా చేసే వైద్య ప్రక్రియలకు మద్దతు ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. నల్ల దారం..మానసికంగా, శారీరకంగా బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా సమస్యలను ఎదుర్కోవడానికి, అడ్డంకులను అధిగమించేందుకే సహాయపడుతుంది.
అదృష్టం:
నలుపు రంగు దారం కాళ్లకు రక్షణ ఇవ్వడం మాత్రమే కాకుండా జీవితంలో పాజిటివ్ వైబ్స్ ను తెస్తుంది. అంతేకాకుండా అదృష్టం తోపాటు సంపదను కూడా ఆకర్షిస్తుందని శాస్త్రం చెబుతుంది.
ఆర్థికంగా ఎదుగుతారు:
కాలికి నల్ల దారం ధరించడం వల్ల ఆర్థికంగా ఎదుగుతారు. మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లైతే మీరు నల్ల దారం కట్టుకోండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న నష్టాలు తొలగిపోవడం కాకుండా ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని శాస్త్రం చెబుతుంది.
ఏ కాలికి కట్టాలి?
జ్యోతిష్యం ప్రకారం స్త్రీలు ఎప్పుడు ఎడమ కాలికి నల్ల దారాన్ని ధరించాలి. పురుషులు వారి కుడి కాలుకు నల్ల దారాన్ని కట్టుకోవాలి.
(NOTE : పైన ఇచ్చిన సమాచారం మనిషి నమ్మకాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం)
Updated Date - Nov 09 , 2024 | 04:33 PM