ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangles: గాజులు వేసుకోవడానికి చిన్నతనంగా ఫీలవుతున్నారా..ఇవి తెలిస్తే షాక్ అవుతారు...

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:21 PM

ఆడవారు చేతులకు గాజులు వేసుకోవడం ఆచారంగా వస్తుంది. అయితే, గాజులు వేసుకోవాలి అనేది సాంప్రదాయమా? లేదా సైంటిఫిక్ రీజన్ ఉందా..? అనే విషయాలను తెలుసుకుందాం..

Bangles

Bangles: ప్రస్తుత కాలంలో చేతులకు గాజులు వేసుకోవడమనేది నామోషీగా ఫీలవుతున్నారు. పల్లెల్లో, సిటీల్లో ఉన్న కేవలం కొందరు మహిళలు మాత్రమే గాజులు వేసుకుంటున్నారు. ఆఫీసులకు వెళ్లే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచ్, మరో చేతికి బ్రేస్‌లెట్ వేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం కేవలం పెళ్లిళ్లు, పండగలు, ఫంక్షన్లకు మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇష్టపడుతారు. అయితే, గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వాటిని వేసుకోవడానికి చిన్నతనంగా, నామోషీగా ఫీల్ కావొద్దని సూచిస్తున్నారు.

ఆరోగ్య ప్రయోజనాలు:

ఆడవారు చేతికి గాజులు వేసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. ఈ గాజులు వేసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గాజులు వేసుకున్న మణికట్టు భాగంలో బ్లడ్ సర్కూలేషన్ వేగం పెరుగుతుంది. అంతేకాకుండా చేతులు అటూ ఇటూ కదలడం ద్వారా గాజులు వెనక్కీ ముందుకు కదులుతాయి.. ఈ కారణంగా బ్లడ్ వెజిల్స్ కు మంచి మసాజ్ అవుతుందని నిపుణులు అంటున్నారు. మట్టి గాజులు వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. ఆ గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అందుకే వాటిని తప్పనిసరిగా వేసుకోవాలని పెద్దలు చెబుతారు. అంతేకాకుండా మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను కూడా గాజులు నివారించగలవు.

గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుంది. వీటివల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. ఒత్తిడిని, అలసటను, నొప్పులను భరించే శక్తి అందుతుంది. ముఖ్యంగా గర్భం దాల్చిన వారు చేతినిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే గర్భిణులకు 5నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది. ఆ సమయంలో వారు అలసటకు గురవుతారు. ఆ అలసటను తగ్గించడంలో గాజులు ఎంతోగానో సహాయపడుతాయని నమ్ముతారు. అందుకే గర్భిణికి శ్రీమంతం చేసే సమయంలో ఎక్కువగా గాజులు తొడుగుతారు. ప్రసవం అయ్యే వరకు గాజులను వేసుకోవడం వల్ల డెలివరీ టైంలో వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు అంటున్నారు.

Updated Date - Nov 12 , 2024 | 12:21 PM