Technology : ఏఐతో ఇంటరాక్షన్‌కు ‘బట్టర్‌ఫ్లైస్’
ABN, Publish Date - Jun 22 , 2024 | 12:52 AM
మామూలు వ్యక్తులు, ఏఐ పర్సన్స్‌లతో ఇంటరాక్షన్‌కు వీలుగా బట్టర్‌ఫ్లైస్ యాప్ అందుబాటులోకి వచ్చింది.
మామూలు వ్యక్తులు, ఏఐ పర్సన్స్‌లతో ఇంటరాక్షన్‌కు వీలుగా బట్టర్‌ఫ్లైస్ యాప్ అందుబాటులోకి వచ్చింది. మనం కొన్ని డిస్ర్కిప్సన్ గనక బట్టర్‌ప్లైస్‌కి ఇస్తే మిగిలిన పని అంతా అదే చేసుకుంటుంది. ఒక ప్రొఫైల్ ఇమేజ్, లైఫ్, కారెక్టర్ అన్నీ సెకెండ్ల వ్యవధిలో క్రియేట్ చేసుకుంటుంది. ఇది అవసరం అయితే తనంతగా తానే మాట్లాడటం, ప్రశ్నిస్తే సమాధానాలు ఇవ్వడం అన్నీ చేస్తుంది. గూగుల్ ప్లే అలాగే యాపిల్ యాప్ స్టోర్‌లో ఈ యాప్ ఉచితంగా లభిస్తోంది. ఇది జనరేటివ్ ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) - సెంట్రిక్ నెట్ వర్కింగ్ యాప్. స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించేందుకు వీలుగా రూపొందించారు. స్నాప్ ఇంక్‌లో ఒకప్పుడు ఇంజనీరింగ్ మేనేజర్‌గా పనిచేసిన వ్యక్తి దీన్ని అభివృద్ధిపర్చారు.
టెక్స్ట్ డిస్ర్కిప్షన్‌తో బట్టర్‌ఫ్లైస్ పర్సన్స్‌ని రూపొందించుకోవచ్చు. మెదడులో పుట్టిన ఆలోచనలకు అనుగుణంగా ఇమేజ్, అదేవిధంగా నిర్వర్తించాల్సిన పని ఉంటాయి. అంతే కాదు, ఆ ఏఐ పర్సన్స్ సందర్భానుసారం లేదంటే కామెంట్‌కు తగ్గట్టు స్వతంత్రంగా సమాధానమిస్తాయి. ఉదా హరణకు రైతు, తను చేసే పనిని ఊహించి యూజర్ రాసిందే తడవు, మూడు వరకు ఏఐ జనరేటెడ్ ఫొటోలకు తోడు హ్యాష్‌ట్యాగ్స్ వచ్చాయి. నెలల తరబడి బేటా టెస్టింగ్ జరిగిన తరవాత కొద్ది రోజుల క్రితం ఈ యాప్‌ను విడుదల చేశారు. ఇన్‌స్టాగ్రామ్ తరహా ఇంటర్‌ఫేస్ దీనికి ఉంది. హార్ట్ ఆకారంలో బటన్, బాణం మాదిరి షేర్ బటన్ ఉన్నాయి. కింద యూజర్లు సమాధానం ఇవ్వవచ్చు. బట్టర్‌ఫ్లైస్‌లో ఏఐ పర్సన్ కోసం ఏమి చేయాలంటే...
హోమ్ పేజీ - ప్లస్ గుర్తుని టాప్ చేయాలి. అక్కడ ఆర్ట్ స్టయిల్(సెమి- రియలిస్టిక్/డ్రాయింగ్)ని ఎంపిక చేసుకోవాలి.
యాప్‌లో ఏఐ ప్రొపైల్ క్రియేషన్ కోసం డిస్ర్కిప్షన్‌ను టైప్ చేయాలి. పేరు ఇవ్వాలి. యూనిక్ పర్సనాలిటీ కోసం గుణాలను జోడించాలి. బ్యాక్‌గ్రౌండ్ అంటే ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, నిర్వర్తిం చాలని భావిస్తున్న పనిని కలపాలి.
అప్పుడు యాప్ ప్రొఫైౖల్ ఉన్న ఫొటోల నుంచి సరైన ఇమేజ్‌ని వెతికే పనిని చేపడుతుంది. వర్ణించిన లక్షణాలకు అనుగుణంగా ఉన్న ఫొటోని తీసుకుని, యూజర్ కోరుకున్నవాటిని కలుపుతుంది.
అప్పుడు ఇక బట్టర్‌ఫ్లైస్ రూపొందించిన ఏఐ వ్యక్తి మెసేజ్‌లు, ఇమేజ్‌లను పోస్ట్ చేస్తూ ఉంటుంది. యూజర్లు కూడా మెసేజ్‌లను పోస్ట్ చేస్తే ఏఐ పర్సన్ స్పందిస్తూ ఉంటారు. సానుకూల దృక్పథంతో కూడిన ఆలోచనలకు తోడు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే సూచనలు కూడా ఇస్తుంది. ప్రస్తుతానికి ఈ యాప్ ఉచితంగానే అందుబాటులో ఉంది. అయితే సబ్‌స్ర్కిప్షన్ మోడల్‌ను రూపొందించే పనిలో సదరు కంపెనీ ఉందని సమాచారం.
Updated Date - Jun 22 , 2024 | 12:52 AM