ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Celebration : ఓనమ్‌కు ‘కసావు’ కళ

ABN, Publish Date - Sep 15 , 2024 | 05:26 AM

ఒక్క ఓనమ్‌నాడే కాదు... కేరళలో ఏ పర్వదినమైనా మహిళలు కసావు చీరలో మెరుస్తారు. ఇది అక్కడ తరతరాలుగా అనుసరిస్తున్న వారసత్వం. రెండు వందల ఏళ్లనాటి ఈ కళ కాలక్రమంలో ఎన్నో హంగులు, వర్పులు సంతరించుకుంది.

సంబరం

లేతపసుపు... శ్వేతవర్ణం మిళితమైన చేనేతపై బంగారపు అంచు అద్దుకొని... మగువకు వన్నెలద్దుతుంది కేరళ సంప్రదాయ చీర ‘కసావు’. కళాకారుల అద్భుతమైన పనితనం... రెండు వందల ఏళ్లకు పైబడిన చరిత్రగల ఈ చీరను నిత్యనూతనంగా నిలుపుతోంది. ‘ఓనమ్‌ చీర’గా కూడా ఖ్యాతికెక్కిన ‘కసావు’ కళాత్మకతకు మళయాళ ప్రాంతంలోనే కాదు... దేశవిదేశాల్లోనూ అభిమానులున్నారు. ఈ చీర అంతటి అపురూపం ఎందుకైంది..! ఓనమ్‌ సందర్భంగా ఒకసారి ఆ కథలోకి వెళదాం.

క్క ఓనమ్‌నాడే కాదు... కేరళలో ఏ పర్వదినమైనా మహిళలు కసావు చీరలో మెరుస్తారు. ఇది అక్కడ తరతరాలుగా అనుసరిస్తున్న వారసత్వం. రెండు వందల ఏళ్లనాటి ఈ కళ కాలక్రమంలో ఎన్నో హంగులు, వర్పులు సంతరించుకుంది. కానీ పండుగల, ప్రత్యేక సందర్భాలప్పుడు ఐవరీ (దంతం) కలర్‌ కాటన్‌ వస్త్రంపై... అంచుగా బంగారు పోగులు పేర్చిన చీరదే నేటికీ అగ్రస్థానం. దీనికి భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది.

‘కసావు’ అనేది కేరళలో ఒక పురాతన చేనేత పద్ధతి. ఆ పేరుతోనే ఈ చీరలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ పద్ధతిలో అతిసున్నితమైన బంగారం, వెండి దారాలతో అంచును నేస్తారు. ఇదే సాంకేతిక విధానంతో ‘ముండు’ (ధోవతీ)పై కూడా అంచులు వేస్తారు. దీన్ని వారు ‘కసావు ముండు’ అంటారు. అంతేకాదు... కేరళలో జీఐ (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌) ట్యాగ్‌ సాధించిన మొట్టమొదటి చేనేత కళ ఇది. ప్రధానంగా ఆ రాష్ట్రంలోని బలరామపురం, చెండమంగళం, కుతమ్‌పుల్లి గ్రామాలు ఈ నేతకు ప్రసిద్ధి.

ట్రావెన్‌కోర్‌ రాజవంశీయుల కాలంలో ‘కసావు’ చీరలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. మహారాజా బలరామ వర్మ... తమిళనాడులోని వల్లియూర్‌ నుంచి సాలియా సామాజిక వర్గానికి చెందిన చేనేత కళాకారుల కుటుంబాలను బలరామపురానికి తీసుకువచ్చారు. కేవలం తమ రాజవంశీయులకు సంబంధించిన వస్త్రాలు నేసేందుకు వారిని ఉపయోగించుకున్నారు. బలరామపురం చీరలు బ్లీచింగ్‌, డైయింగ్‌ లేని సహజసిద్ధమైన కాటన్‌ (కోరా)తో రూపొందిస్తారు. వేసవిలో కేరళ ఉక్కపోత వాతావరణానికి ఇవి సరిగ్గా సరిపోతాయి. కాలక్రమంలో మోటిఫ్స్‌, జరీతో టెంపుల్‌ బోర్డర్స్‌ వంటివి చీరపై సింగారించుకున్నాయి. పుతమ్‌పుల్లి కళాకారులను కొచీ మహారాజు ప్రోత్సహించారు. వందల ఏళ్లు గడిచినా ఈ చీరల సొగసులానే... వాటిపై మనసు పడే మగువలు అంతకంతకూ పెరుగుతున్నారే కానీ... ఇసుమంతైనా తగ్గలేదు. అదే కసావు కళ ప్రత్యేకం.

Updated Date - Sep 15 , 2024 | 05:27 AM

Advertising
Advertising