Technology : వాచ్ ఓఎస్ 11 అప్డేట్‌తో రింగ్‌టోన్‌లో మార్పు
ABN, Publish Date - Jun 22 , 2024 | 12:45 AM
యాపిల్ వాచీలో ఇప్పటి వరకు డిఫాల్ట్‌గా ఒకే రింగ్‌టోన్ ఉంది. అయితే వాచ్‌ఓఎస్ 11 అప్డేట్‌తో వేర్వేరు రింగ్‌టోన్‌లను తీసుకునే అవకాశం యూజర్లకు కలుగుతుంది.
యాపిల్ వాచీ
యాపిల్ వాచీలో ఇప్పటి వరకు డిఫాల్ట్‌గా ఒకే రింగ్‌టోన్ ఉంది. అయితే వాచ్‌ఓఎస్ 11 అప్డేట్‌తో వేర్వేరు రింగ్‌టోన్‌లను తీసుకునే అవకాశం యూజర్లకు కలుగుతుంది. ‘9టు5మేక్’ రిపోర్ట్ ప్రకారం తాజా అప్డేట్‌తో రెండు ఒరిజినల్ సహా ఎనిమిది రింగ్‌టోన్‌లకు అవకాశం ఉంటుంది. పెబల్స్(సెల్యులర్ రింగ్‌టోన్), ఫోకస్, జింగిల్(ఒరిజినల్ రింగ్‌టోగోన్), నైట్‌థవాక్, ట్రాన్స్‌మిట్, ట్విర్ల్, వైండప్, వండర్ ఈ రింగ్‌టోన్స్‌లో ఉన్నాయి. వీటితో ఇంకో సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. అలెర్ట్స్, నోటిఫికేషన్స్, రిమైండర్స్, టెక్స్ట్ మెసేజెస్, ఈమెయిల్స్ తదితరాలకు వేర్వేరుగా ఈ రింగ్‌టోన్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. రింగ్‌టోన్స్‌కు తోడు ఆటోమేటిక్ స్లీప్ ట్రాకింగ్‌ను కూడా తీసుకువస్తున్నట్టు సమాచారం. షాజమ్ కోసం స్మార్ట్ స్టాక్ విడ్జెట్‌ను తీసుకువస్తోంది. యాప్‌స్టోర్‌లో ఇది ఇప్పటికే యూజర్లకు అందుబాటులో ఉంది. మ్యూజిక్ సెర్చ్ వేగంగా జరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది.
Updated Date - Jun 22 , 2024 | 12:45 AM