Navya : కాళ్ల మంటలా...
ABN , Publish Date - May 22 , 2024 | 01:22 AM
మన శరీరంలో నాడీ వ్యవస్థకు సంబంధించి అంశాలలో పాదాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి.
మన శరీరంలో నాడీ వ్యవస్థకు సంబంధించి అంశాలలో పాదాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినప్పుడు- వాటిని ముందుగా పట్టి చెప్పేవి మన పాదాలే! మధుమేహం ఉన్నవారిలో పాదాలలో తిమ్మిర్లు ఏర్పడుతూ ఉంటాయి. కొందరికి మంటలు కూడా ఉంటాయి. అంతే కాకుండా పాదాలకు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా- అది మానటానికి చాలా సమయం పడుతుంది.
అందువల్ల ఎవరికైనా పాదాలకు దెబ్బతగిలి.. అది మానటానికి ఎక్కువ సమయం పడుతోందంటే వారికి మధుమేహం ఉన్నట్లు లెక్క! అలాంటి సమయంలో తప్పకుండా మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. లేదా మధుమేహాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవాలి.
అంతే కాకుండా కొందరిలో కాళ్లకు రక్తప్రసారం సరిగ్గా కాదు. దీని వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. అలాంటి వారిలో కాళ్లు నల్లబడతాయి. ఎప్పుడైనా కాళ్లలో నల్లటి మచ్చలు వచ్చాయంటే మధుమేహం ఉన్నట్లు లెక్క!