ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పండ్ల మొక్కలు పెంచేద్దాం..!

ABN, Publish Date - Nov 28 , 2024 | 05:18 AM

పూల మొక్కలు, పండ్ల మొక్కలు పెంచాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది.

పూల మొక్కలు, పండ్ల మొక్కలు పెంచాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. కానీ ఇంటి పరిసరాల్లో మొక్కలను పెంచడానికి సరిపోయే స్థలం లేదని బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా బాల్కనీలో చిన్న కుండీల్లో సులువైన పద్దతుల్లో పెంచుకునే పండ్ల మొక్కల వివరాలు తెలుసుకుందాం.

బొప్పాయి

బొన్సాయి రకం బొప్పాయి చెట్టును కుండీలో పెంచవచ్చు. ఈ పండ్లు చాలా తీయగా రుచికరంగా ఉంటాయి కూడా. ఈ చెట్టును పెంచడానికి పద్దెనిమిది అంగుళాల కన్నా ఎక్కువ లోతున్న కుండీని ఎంచుకోవాలి. అందులో ఇసుక పాళ్లు ఎక్కువగా ఉండే నల్ల మట్టిని నింపాలి. దీనిలో యూరియా తదితర ఎరువులు కలపాలి. నర్సరీ నుంచి బొన్సాయి రకం బొప్పాయి మొక్కను తెచ్చి కుండీలో లోతుగా నాటాలి. ప్రతి రోజూ తగినన్ని నీళ్లు పోస్తూ సూర్మరశ్మి తగిలేలా ఉంచాలి. నాలుగు నుంచి ఆర్నెల్లలో బొప్పాయి కాత ఆరంభమవుతుంది.

స్ట్రాబెర్రీ

ఈ మొక్కని కుండీలో పెంచడం చాలా సులువు. చలికాలంలో ఇది వేగంగా పెరుగుతుంది కూడా. ఈ మొక్కని పెంచడానికి అంతగా లోతు లేని వెడల్పాటి కుండీని ఎంచుకోవాలి. దీనిలో తోట మట్టి నింపాలి. ఇందులో స్ట్రాబెర్రీ గింజలు చల్లి మొక్కలు పెంచవచ్చు. లేదంటే నర్సరీ నుంచి స్ట్రాబెర్రీ మొక్కను తెచ్చి నాటవచ్చు. ఈ మొక్క పెరుగుతున్నపుడు దానికి ఊతగా కర్ర లేదా చెక్కను నిలబెట్టాలి. పెద్దగా సంరక్షణ అవసరం లేదు.


కివీ

పిల్లలకు, పెద్దలకు ఇష్టమైన పండు ఇది. చలికాలంలో ఈ పండు మొక్కను పెంచడం చాలా సులువు. బొన్సాయి రకాన్ని కూడా కుండీలో పెంచవచ్చు. లోతుగా ఉన్న పెద్ద కుండీలో తోటమట్టి, సేంద్రియ ఎరువు కలపాలి. కనీసం పది వారాల వయసు ఉన్న మొక్కను నర్సరీ నుంచి తెచ్చి కుండీలో నాటాలి. ఈ మొక్కకు ఎండ తగిలేలా ఉంచి రోజుకు రెండు పూటలా దానిపై నీరు చిలకరించాలి.

నిమ్మ

ఎండ తగులుతూ ఉంటే నిమ్మ మొక్క కూడా వేగంగానే పెరుగుతుంది. ఒక కుండీలో తోటమట్టి, కొబ్బరి పీచు, సేంద్రీయ ఎరువు, ఆవుపేడ వేసి బాగా కలపాలి. ఇందులో నిమ్మ మొక్కను తెచ్చి నాటాలి. లేదంటే నిమ్మ గింజలను పలుచని పేపర్లో మొలకెత్తించి కూడా నాటవచ్చు. ఈ మొక్క పెరుగుతున్నపుడు దానిపై కొన్ని నీళ్లను చిలకరిస్తే చాలు. ఈ మొక్కకు ముళ్లు కూడా ఉంటాయి.

Updated Date - Nov 28 , 2024 | 05:18 AM