ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Benefits of Amla : ఉదయమే ఉసిరి తింటే?

ABN, Publish Date - Sep 10 , 2024 | 02:17 AM

ఉసిరితో ఒరిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే! అయితే ఉసిరిని పరగడుపున తింటే వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు, పెద్దపేగు ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుంది. ఉసిరితో అందే ఇంకొన్ని ఆరోగ్య ప్రయోజాలు ఏవంటే...

హెల్త్‌ వెల్త్‌

ఉసిరితో ఒరిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే! అయితే ఉసిరిని పరగడుపున తింటే వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు, పెద్దపేగు ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుంది. ఉసిరితో అందే ఇంకొన్ని ఆరోగ్య ప్రయోజాలు ఏవంటే...

  • విటమిన్‌ సి సమృద్ధిగా దొరికే ఉసిరిని పరగడుపున తింటే వ్యాధులతో పోరాడే వ్యాధినిరోధకశక్తి పెరగడంతో పాటు, సీజనల్‌ రుగ్మతలైన జలుబు, దగ్గులు కూడా దరి చేరకుండా ఉంటాయి.

  • ఉసిరి జీర్ణరసాలను ప్రేరేపింంచి, పేగుల ఆరోగ్యాన్ని పెంచుతుంది. దాంతో జీర్ణశక్తి పెరగడంతో పాటు, పోషకాల శోషణ కూడా మెరుగవుతుంది. మలబద్ధకం కూడా వదులుతుంది.

  • ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ సిలు, చర్మానికి బిగుతునిచ్చే కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. దాంతో చర్మం మీద ముడతలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.

  • చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. దాంతో గుండె జబ్బులు దరి చేరకుండా ఉంటాయి. ఉసిరితో అధిక రక్తపోటు అదుపులోకొస్తుంది.

  • మెటబాలిజం పెరిగి, శరీరంలోని విషాలు బయటకు వెళ్లిపోయి శరీర బరువు కూడా అదుపులోకొస్తుంది. ఉసిరిలోని పీచు ఆకలిని అదుపులో ఉంచి, అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరకుండా నియంత్రిస్తుంది.

  • రక్తంలోని చక్కెర మోతాదులు క్రమబద్ధమై మధుమేహులకు ప్రయోజనాన్ని అందిస్తుంది. అలాగే మధుమేహ సంబంధ ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందాలన్నా, పరగడుపున ఉసిరి తినాలి.

  • యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఉసిరి తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

  • ఉసిరి శరీరంలోని విషాలను హరిస్తుంది. కాబట్టి కాలేయం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఉదయాన్నే ఉసిరి తినాలి.

Updated Date - Sep 10 , 2024 | 02:19 AM

Advertising
Advertising