Fitness : లెగ్స్ లవ్లీగా...
ABN, Publish Date - Sep 03 , 2024 | 12:28 AM
కాళ్లు, తొడలు నాజూకుగా తయారవ్వాలంటే ఆ ప్రదేశాల్లోని కొవ్వును కరిగించి, కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయాలి. ఇందుకోసం బరువులు లేకుండా, బరువులతో కూడిన కొన్ని రకాల వ్యాయామాలు చేయాలి.
ఫిట్‌నెస్‌కాళ్లు, తొడలు నాజూకుగా తయారవ్వాలంటే ఆ ప్రదేశాల్లోని కొవ్వును కరిగించి, కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయాలి. ఇందుకోసం బరువులు లేకుండా, బరువులతో కూడిన కొన్ని రకాల వ్యాయామాలు చేయాలి.
వార్మప్ వ్యాయామాలు: వ్యాయామానికి తగ్గట్టుగా శరీరాన్ని, మరీ ముఖ్యంగా కాళ్లు, తొడలను సిద్ధం చేయడం కోసం....
సిట్ అప్స్: మోకాళ్లు వంచి, నేల మీద గొంతుక్కూర్చునే వ్యాయామం చేయాలి. ఇలా 25 రిపిటీషన్స్ 3 సెట్స్ చేయాలి.
వాల్ సిట్ అప్: గోడ కుర్చీ వ్యాయామం ఇది. ఈ భంగిమలో 30 సెకండ్ల పాటు 5 సార్లు కూర్చోవాలి.
లెగ్ థై ప్రెస్: ఈ వ్యాయామం కోసం కేటాయించిన పరికరం మీద కూర్చుని 50 కిలోల బరువులను కాళ్లతో నెట్టాలి.
ఆసరా కోసం పరికరానికి ఇరువైపులా ఉన్న హ్యాండిల్స్‌ను పట్టుకోవాలి. వెన్ను, తలను నిటారుగా ఉంచాలి.
రెండు పాదాలను పెడల్ పై ఉంచి, రెండు కాళ్ల మీద సమంగా బలం మోపుతూ పెడల్‌ను ముందుకు నెట్టాలి.
ఈ వ్యాయామంతో తొడల మీద బరువు పడుతుంది.
ఈ వ్యాయామం 20 రిపిటీషన్స్ 3 సెట్లు చేయాలి.
స్క్వాట్ ప్రెస్: ఈ వ్యాయామం నేల మీద నిలబడి చేయాలి. ఇందుకోసం 25 కిలోల డంబెల్స్ ఎంచుకోవచ్చు.
కాళ్ల మధ్య అడుగు దూరం ఉంచి నిటారుగా నిలబడాలి.
రెండు చేతుల్లోకి డంబెల్స్ తీసుకుని తల మీదుగా పైకి లేపాలి.
బరువులు లేపినప్పుడు రెండు చేతులు వంచకుండా నిటారుగా ఉంచాలి.
ఇదే భంగిమలో నెమ్మదిగా కాళ్లను వంచి కుర్చీ మీద కూర్చున్నట్టుగా కిందకు కుంగాలి.
తిరిగి అంతే నెమ్మదిగా పైకి లేవాలి.
ఇలా 25 రిపిటీషన్స్ 3 సెట్లు చేయాలి.
రొమేనియన్ డెడ్ లిఫ్ట్: బరువైన రాడ్‌తో చేసే వ్యాయామమిది. చెరో వైపు 10 కిలోల బరువులను ఎంచుకోవచ్చు.
నిటారుగా నిలబడి, వంగి రాడ్‌ను రెండు చేతుల్లోకి తీసుకుని పైకి లేవాలి. లేచేటప్పుడు ఛాతీ ముందుకు ఉండాలి.
వెన్ను నిటారుగా ఉండాలి, బరువును వంగి చేతుల్లోకి తీసుకునేటప్పుడు మోకాళ్లను కొద్దిగా వంచాలి.ఇలా 15 రిపిటీషన్స్ 3 సెట్లు చేయాలి.
స్టిఫ్ లెగ్ డంబెల్ డెడ్ లిఫ్ట్: ఈ వ్యాయామం 20 కిలోల బరువులతో చేయవచ్చు.
చెరొక చేత్తో పది కిలోల డంబెల్స్‌ను తీసుకోవాలి.
రెండు కాళ్ల మధ్య అరడుగు దూరం ఉంచి నిటారుగా నిలబడాలి.
రెండు చేతుల్లోని డంబెల్స్ అభిముఖంగా వచ్చేవిధంగా ముందుకు వంగి చేతులును దించాలి.
వంగేటప్పుడు మోకాళ్లను కొద్దిగా వంచి, పైకి లేవాలి.
ఇలా 20 రిపిటీషన్స్ 3 సెట్లు చేయాలి.
Updated Date - Sep 03 , 2024 | 12:36 AM