ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విషాదం నుంచి జ్ఞానోదయం దాకా

ABN, Publish Date - Sep 06 , 2024 | 05:53 AM

‘‘సమస్త దిశల నుంచి పొంగి ప్రవహిస్తూ నదులన్నీ వచ్చి సముద్రాన్ని చేరుతాయి. ఆ ప్రవాహ జలాలన్నిటినీ సముద్రం కలుపుకొంటుంది. కానీ తన హద్దులను ఏమాత్రం దాటిపోదు. అదే విధంగా సమస్త విషయాలను తెలుసుకుంటున్నా...

గీతాసారం

‘‘సమస్త దిశల నుంచి పొంగి ప్రవహిస్తూ నదులన్నీ వచ్చి సముద్రాన్ని చేరుతాయి. ఆ ప్రవాహ జలాలన్నిటినీ సముద్రం కలుపుకొంటుంది. కానీ తన హద్దులను ఏమాత్రం దాటిపోదు. అదే విధంగా సమస్త విషయాలను తెలుసుకుంటున్నా, సమస్త భోగాలు కళ్ళకు కనిపిస్తున్నా స్థితప్రజ్ఞుడు ఎటువంటి వికారానికి లోనుకాడు. అటువంటి వ్యక్తే శాంతిని పొందగలడు. భోగాల పట్ల ఆసక్తి ఉన్నవాడు మోక్షాన్ని పొందలేడు. ఏ వ్యక్తి అయితే సమస్తమైన కోరికలను విడిచిపెడతాడో, దేనిమీదా ఆశలేకుండా, అహంకార మమకారాలు లేకుండా ఉంటాడో... అతనే బ్రహ్మానందస్థితిని పొందుతాడు’’ అని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్సాడు. ఈ సందర్భంగా... శాశ్వతమైన స్థితిని (మోక్షాన్ని) పోల్చడానికి సముద్రాన్ని ఆయన ఉదాహరణగా తీసుకున్నాడు. దీనిద్వారా కొన్ని విషయాలు స్పష్టం చేశాడు. మొదటిది... ఇంద్రియాల ద్వారా నిరంతరం ప్రేరణలు, ప్రలోభాలు, కోరికలు తనలో ప్రవేశించినా... గంభీరమైన సముద్రంలా... శాశ్వతమైన స్థితిని పొందిన మనిషి స్థిరంగా ఉంటాడు. రెండోది... సముద్రంలో కలిసినప్పుడు నదులు తమ ఉనికిని కోల్పోతాయి. అదే విధంగా శాశ్వతమైన స్థితిని చేరుకున్న వ్యక్తిలో ప్రవేశించిన కోరికలు కూడా తమ ఉనికిని పోగొట్టుకుంటాయి. మూడోది... మనకు ఏదైనా దుఃఖదాయకంగా మారితే.. దానికి కారణం బాహ్య ప్రపంచం మనలో కలిగించే ఉద్రేకాలను నియంత్రించలేకపోవడమే. అందుకే... సముద్రంలా మనం కూడా అటువంటి అస్థిరమైన, అనిత్యమైన ఉద్వేగాలను, ఉద్రేకాలను విస్మరించడం నేర్చుకోవాలని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు.


మనకు ఉన్న అవగాహన ప్రకారం... ప్రతి కర్మకు కర్త, కర్మఫలం ఉంటాయని అనుకుంటాం. మొదట... కర్మను, కర్మ ఫలాలను వేరుచేసే మార్గాన్ని శ్రీకృష్ణుడు బోధించాడు. ఆ తరువాత... కర్తను, కర్మను వేరు చేయడం కోసం అహంకారాన్నీ, కర్తృత్వ భావాలను వదిలెయ్యాలని సూచించాడు. ఈ శాశ్వతమైన శాంతి స్థితిని చేరుకున్నాక తిరిగి వెనక్కు వచ్చే ప్రసక్తే లేదు. అప్పుడు ఏ కర్మ అయినా... ఈ బ్రహ్మాండంలోని కోటానుకోట్ల చర్యలలో ఒకటిగా మిగిలిపోతుంది. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు విషాదంలో మునిగిపోయాడు. అది అర్జున విషాదయోగం. ఆ విషాదాన్ని సానుకూలంగా ఉపయోగించినప్పుడు... దానికి మోక్షాన్ని అందించే సామర్థ్యం ఉంటుందని ‘భగవద్గీత’లోని రెండో అధ్యాయమైన ‘సాంఖ్యయోగం’లో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు.

కె. శివప్రసాద్‌

ఐఎఎస్‌

Updated Date - Sep 06 , 2024 | 05:53 AM

Advertising
Advertising