Aloo Chaat : వానాకాలం చల్లని సాయంత్రాలు ఈ ఆలూ చాట్ తిని చూడండి..!
ABN, Publish Date - Jul 20 , 2024 | 01:26 PM
బంగాళాదుంపలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి, వాపును ఎదుర్కోవడానికి సహాయపడతాయి.
వేడి దిగిపోయే వేసవిలో ఏమోకానీ.. వానాకాలాలు, చలిసాయంత్రాలు మాత్రం కారంకారంగా ఏదైనా తినేయాలనిపిస్తుంది మనలో చాలా మందికి. దీనికోసం మిర్చీ బండ్ల వెనుక, చాట్ బండ్ల దగ్గరా కాపుకాస్తాం. వేడివ వేడిగా తింటే అదో మజా.. ఇక ఈ టైంలో ఎక్కువగా తినేది చాట్స్ అత్యంత ప్రజాదరణ పొందిన చాట్ లలో ఒకటి ఆలూ చాట్.. లేదా పొటాటో చాట్. వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ బెస్ట్ జాబితాలో తప్పక ఆలూ చాట్ ఉంటుంది. దీనిని తినడానికి పెద్ద ప్రణాళికలేం అవసరం లేదు. కాస్త చల్లగాలి, చల్లని సాయంత్రాలు చక్కని హాయిని అందిస్తుంది నాలుకకు..
బరువు తగ్గాలనుకునే వారుకి ఆలూ పనీర్ చాట్ మంచిదేనా.
బరువు తగ్గాలనుకునే వారు ఈ చాట్ తినచ్చు. బంగాళా దుంపలు బరువును అమాంతం పెంచేయవు. బంగాళాదుంపలలో రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి, ప్రేగుల ఆరోగ్యానికి మంచిది. ఇంకా అధిక ప్రోటీన్ కలిగిన పనీర్ కలిపి చేసే ఈ చాట్ నోరు ఊరించడమే కాకుండా మంచి ఫీల్ ఇస్తుంది. తాజా కూరగాయలు, పోషకాలు అధికంగా ఉండే చట్నీలు కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.
ఆలూ పనీర్ చాట్ ఇంట్లోనే ఎలా చేయడం..
ఆలూ పనీర్ చాట్ ఇంట్లోనే తయారు చేయడం ఎలా పొటాటో పనిర్ చాట్ కోసం పుదీనా ఆకులు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి అన్నీ కలిపి చట్నీ ప్రిపేర్ చేయాలి. తర్వాత చింతపండు. చిన్న బెల్లం కలిపి మిక్సీ పట్టాలి. దీనిని కూడా చట్నీలో వేసి పక్కన పెట్టుకోవాలి. నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాకా పనీర్ ముక్కలను బంగారు రంగు వచ్చే వరకూ వేయించి తీసుకోవాలి. బంగాళా దుంపలను, తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, వేరుశెనగ పప్పును కలిపి, తయారు చేసుకున్న చాట్ లో కలుపుకోవాలి. అంతే చాట్ రెఢీ.
ఆలూ చాట్ ఆరోగ్య ప్రయోజనాలు..
గుండె ఆరోగ్యం: పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు: బంగాళాదుంపలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి, వాపును ఎదుర్కోవడానికి సహాయపడతాయి.
Milk Time : పాలను ఏ సమయంలో తీసుకోవాలి.. !
చర్మ ఆరోగ్యం: విటమిన్లు,యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మానికి దోహదం చేస్తాయి.
పోషకాలు : బంగాళాదుంపలు C, B6, పొటాషియం, ఫైబర్ వంటి విటమిన్లతో నిండి ఉంటాయి.
శక్తి : ఇందులోని అధిక కార్బోహైడ్రేట్లు శక్తిని అందిస్తాయి.
Sleeping Health : సరైన నిద్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
జీర్ణ ఆరోగ్యం: ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.
రోగనిరోధక వ్యవస్థ : విటమిన్ సి కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
తక్కువ కొవ్వు: సమతుల్య ఆహారాన్నితీసుకోవడం మంచి ఎంపిక.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 20 , 2024 | 01:26 PM