ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అవేర్‌నెస్‌ : హెర్నియాతో జాగ్రత్త

ABN, Publish Date - May 21 , 2024 | 12:27 AM

చర్మపు తిత్తిలోకి పేగులు దిగిపోయి పొత్తికడుపు లేదా గజ్జల్లో హెర్నియా కనిపిస్తే వీలైనంత తొందరగా వైద్యుల్ని సంప్రతించి చికిత్స మొదలుపెట్టాలి.

అవేర్‌నెస్‌

చర్మపు తిత్తిలోకి పేగులు దిగిపోయి పొత్తికడుపు లేదా గజ్జల్లో హెర్నియా కనిపిస్తే వీలైనంత తొందరగా వైద్యుల్ని సంప్రతించి చికిత్స మొదలుపెట్టాలి. లేదంటే పొట్టలో చర్మం అడుగున ఏర్పడిన రంథ్రం పెద్దదైపోతూ సమస్య మరింత జటిలమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ తిత్తిలోకి చేరుకున్న పేగులకు రక్త ప్రసరణ అందక కుళ్లిపోవచ్చు కూడా! ఇలాంటప్పుడు ఆ పేగులు సెప్టిక్‌ అవుతాయి. ఇన్‌ఫెక్షన్‌ పెరిగి ప్రాణాలకే ప్రమాదం సంభవించవచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసే కొంతమందిలోనైతే పేగుల పనితీరు తలకిందులై మలం, ఆహారం కలిసిపోయి అవి వెళ్లే మార్గాలు తారుమారవ్వచ్చు. ఇది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి. ఇలా జరగకుండా ఉండాలంటే హెర్నియా లక్షణాలు కనిపించగానే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.

  • హెర్నియా రాకుండా...

హెర్నియా రాకుండా ఉండాలంటే పొత్తికడుపు మీద ఒత్తిడి పనే పనులకు దూరంగా ఉండాలి. అలాగే సర్జరీల కోసం అనుభవఙ్ఞులైన వైద్యులను ఎంచుకోవాలి. హెర్నియా రాకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు మరికొన్ని...

  • సాధారణ ప్రసవం, సిజేరియన్‌ సర్జరీ తర్వాత తప్పనిసరిగా పొట్ట కండరాలు బలపడే వ్యాయామాలు చేయాలి.

  • మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.

  • మధుమేహం అదుపులో ఉంచుకోవాలి.

  • దగ్గు తెప్పించే ధూమపానం మానేయాలి.

  • పురుషులు ప్రాస్టేట్‌ గ్రంథి సమస్యలను సరిదిద్దుకోవాలి.

  • బరువులెత్తేటప్పుడు క్రమపద్ధతి పాటించాలి.

  • ఎత్తుకు తగిన బరువు మెయింటెయిన్‌ చేయాలి.

  • అధిక బరువు తగ్గించుకోవాలి.

  • దగ్గుకి కారణమయ్యే రుగ్మతల్ని అదుపు చేయాలి.

Updated Date - May 21 , 2024 | 12:27 AM

Advertising
Advertising