Health Benefits : బరువు తగ్గాలన్నా, జుట్టుపెరుగుదలకు చక్కని ఎంపిక బ్లాక్ సీడ్స్ ఇంకా వీటితో..
ABN, Publish Date - Jul 01 , 2024 | 03:47 PM
బ్లాక్ సీడ్స్ లో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది జుట్టు సమస్యలను తగ్గించేందుకు, హైడ్రేటెడ్ మెరిసే జుట్టుకు అద్భుతమైన చికిత్స. అలోపేసియా వంటి జుట్టు లేదా స్కాల్ప్ కండిషన్ తో వ్యవహరిస్తుంది.
బ్లాక్ సీడ్స్ వీటినే నల్ల జీలకర్ర అని పిలుస్తారు. దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, నైపుతి ఆసియాకు చెందిన పుష్పించే మొక్క అయిన నిగెల్లా సాటివా నుంచి వచ్చింది. ఈ మొక్క 8 నుంచి 35 అంగుళాల వరకూ పెరుగుతుంది. ఇది మధుమేహం, నొప్పి, జీర్ణ సమస్యలు వంటి అనేక అనారోగ్యాలు, రుగ్మతలకు చికిత్స చేస్తుంది.
ఇందులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్, బ్లాక్ సీడ్ ఆయిల్లో ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడతుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది.
Health Tips : మైగ్రేన్ నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!
బ్లాక్ సీడ్స్ లో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది జుట్టు సమస్యలను తగ్గించేందుకు, హైడ్రేటెడ్ మెరిసే జుట్టుకు అద్భుతమైన చికిత్స. అలోపేసియా వంటి జుట్టు లేదా స్కాల్ప్ కండిషన్ తో వ్యవహరిస్తుంది. పొడవాటి ఒత్తైన జుట్టుకు పోషణను అందించే క్రమంలో బ్లాక్ సీడ్స్ మంచి ఎంపిక. ఇది జుట్టు పెరుగుదలకు సహజ పరిషారంగా పనిచేస్తుంది. స్కాల్ఫ్ ను మృదువుగా చేస్తుంది. పోషణనిస్తుంది. ఆరోగ్యకరమైన ఫైబర్లను ఉత్పత్తి చేస్తుంది. ఆరోగ్యకరమైన జట్టుకు ఇది చక్కని పరిష్కారంగా మారుతుంది.
బరువు తగ్గడానికి..
బ్లాక్ సీడ్స్ ఆహారంగా తీసుకోవాలంటే ఇలా చేయాలి. బాగా ఎండిన బ్లాక్ సీడ్స్ వేయించి, బరకగా పొడి చేసుకోవాలి. దీనిని గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేయాలి. రోజూ గోరు వెచ్చని నీటితో ఈ పౌడర్ కలిపి తీసుకోవాలి. దీనిని నీటితోనేకాక బ్రెడ్, వోట్ మిల్, స్మూతీస్ లలోనూ తీసుకోవచ్చు.
Health Tips : మైగ్రేన్ నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!
బ్లాక్ సీడ్ ఆయిల్..
అర టీ స్పూన్ బ్లాక్ సీడ్ ఆయిల్ తో ఒక కప్పు కేఫీర్, పెరుగు, కలిపి తీసుకోవచ్చు.
ఇది బ్లడ్ షుగర్ ని నియంత్రిస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది.
గుండె జబ్బులు, సంబంధిత రుగ్మతలను కూడా తగ్గిస్తుంది. అధిక కొలెస్ట్రాల్, అధిక ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. ఆరు నుంచి 12 వారాల ఉపయోగం తర్వాత బ్లాక్ సీడ్ ఆయిల్ ఫలితం కనిపిస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 01 , 2024 | 03:47 PM