ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bleeding Gums: చిగుళ్ల నుంచి రక్తం కారడం ప్రమాదానికి సంకేతమా? తప్పక తెలుసుకోండి..!

ABN, First Publish Date - 2024-02-06T15:31:15+05:30

Bleeding Gums Causes: ప్రస్తుత కాలంలో చాలా మంది చిగుళ్లకు సంబంధించి సమస్యలతో బాధపడుతున్నారు. చిగుళ్ల నుంచి రక్తస్రావం అవడం, చిగుళ్లు ఎర్రగా మారడం జరుగుతుంది. అయితే, దీనికి కారణం చిగుళ్ల వ్యాధి/పీరియాంటైటిస్ వంటి అంతర్లీన కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Bleeding Gums Causes

Bleeding Gums Causes: ప్రస్తుత కాలంలో చాలా మంది చిగుళ్లకు సంబంధించి సమస్యలతో బాధపడుతున్నారు. చిగుళ్ల నుంచి రక్తస్రావం అవడం, చిగుళ్లు ఎర్రగా మారడం జరుగుతుంది. అయితే, దీనికి కారణం చిగుళ్ల వ్యాధి/పీరియాంటైటిస్ వంటి అంతర్లీన కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చిగుళ్లలో వాపు రావడం, ఎర్రగా మారడం, రక్తం రావడం జరుగుతుంది. మరి చిగుళ్ల నుంచి రక్తం రావడానికి కారణం ఏంటి? ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

చిగుళ్లలో రక్త స్రావానికి కారణం..

👉 చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

👉 నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవడం.

👉 విపరీతమైన ధూమపానం చేయడం

👉 ట్రెంచ్ మౌత్

👉 విటమిన్ కె లోపం

👉 మధుమేహం

👉 గర్భధారణ, యుక్తవయస్సు, రుతువిరతి సమయంలో హార్మోన్ మార్పులు.

👉 ఒత్తిడి

👉 లుకేమియా

👉 హెచ్ఐవి/ఎయిడ్స్ వంటివి చిగుళ్లలో రక్తస్రావానికి కారణాలుగా చెబుతున్నారు వైద్య నిపుణులు.

చిగుళ్లలో రక్తస్రావానికి చికిత్స ఏంటి?

మీ చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నట్లయితే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సూచనలు పాటిస్తూ నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నోటిని తరచుగా శుభ్రం చేసుకోవడం, యాంటీబయాటిక్స్ తీసుకోవడం, సరిగా బ్రష్ చేయడం చేస్తుండాలి. అయితే, కొన్నిసార్లు చిగుళ్లలో రక్త స్రావానికి కారణం మధుమేహం, రక్తం గడ్డకట్టకపోవడం, విటమిన్ లోపాలు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలకు దంత వైద్యుల మార్గదర్శకత్వంలో తగిన చికిత్స తీసుకోవాలి.

చిగుళ్ళలో రక్తస్రావం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

👉 బ్రష్ చేసేటప్పుడు జాగ్రత్త పాటించాలి.

👉 రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి.

👉 ముఖ్యంగా మీరు వాడే టూత్ బ్రష్ మృదువుగా ఉండాలి.

👉 సరైన టూత్‌పేస్ట్‌ను ఎంచుకోవాలి.

👉 చిగుళ్లలో రక్తస్రావం జరగకుండా ఉండేందుకు మార్కెట్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న టూత్‌పేస్ట్‌ను ఉపయోగించాలి.

👉 రోజుకు ఒకసారి ఫ్లాస్ చేయాలి.

👉 చిగుళ్ల మధ్యలో చిక్కుకున్న ఆహార పదార్థాలను తొలగించాలి.

ఆరోగ్యకరమైన ఆహారం..

చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. చిగుళ్లు, దంతాలను శుభ్రంగా ఉంచడానికి, లాలాజల ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బ్రోకలీ, నారింజ, మిరియాలు వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

ఒత్తిడి తగ్గించుకోవాలి..

ఒత్తిడి అనేది చిగుళ్ల వ్యాధికి దారి తీస్తుంది. మానసిక ఒత్తిడి అనేది వ్యక్తి శరీరంలో అనేక సమస్యలకు కారణమవుతుంది. వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. వ్యాధుల తీవ్రతను క్రమంగా పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా చిగుళ్లకు సంబంధించిన సమస్య ఎక్కువ అవుతుందని అంటున్నారు.

Updated Date - 2024-02-06T15:31:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising