Eye Health : ఏసిలో ఉండే వారికి ఈ సమస్య తప్పదు.. జర జాగ్రత్త..!
ABN, Publish Date - May 02 , 2024 | 02:04 PM
వేసవికాలంలో ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఎక్కువ సమయం ఉండేవారికి కళ్ళు పొడిబారడం అనే సమస్య ఉంటుంది. దీనితో కంటి నరాలు కన్నీటిని ఉత్పత్తి చేయలేవు. అలాగే కన్నీళ్ళు ఆవిరై కళ్లు పొడిబారే సమస్య ఎక్కువగా ఉంటుంది.
సమ్మర్ వచ్చిందంటే వేడి తట్టుకోవడం అందరివల్లా కాదు. వేసవి కాలానికి తగినట్టుగా ఎండ వేడి పెరుగుతూనే ఉంటుంది. దీనికి ప్రత్యమ్నాయంగా కూలర్స్, ఏసీలను వాడుతుంటాం. ఎయిర్ కండీషనింగ్ వాతావరణంలో ఎక్కువ సమయం గడిపేవారికి చికాకు, ఎరుపు కళ్ళు అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
వేసవికాలంలో ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఎక్కువ సమయం ఉండేవారికి కళ్ళు పొడిబారడం అనే సమస్య ఉంటుంది. దీనితో కంటి నరాలు కన్నీటిని ఉత్పత్తి చేయలేవు. అలాగే కన్నీళ్ళు ఆవిరై కళ్లు పొడిబారే సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని లక్షణాలు దురద, మంట, ఎరుపు కళ్లు, కాంతి సున్నితత్వాన్ని కలిగి ఉండటం వంటివి ఉంటాయి.
దీనికి పరిష్కారం..
కళ్లు పొడిబారకుండా ఉండాలంటే రోజంతా నీరు పుష్కలంగా తాగాలి. ఇది కళ్లను పొడిబారకుండా చేస్తుంది. కెఫిన్, ఆల్కహాల్ వంటి పానీయాలను తగ్గించాలి. లేదంటే ఇవి డిహైడ్రేషన్ కు దారి తీస్తాయి.
Summer Skin Care : వేసవిలో జిడ్డు చర్మం ఇబ్బంది పెడుతుందా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..!
కళ్లు బ్లింక్ చేస్తూ ఉండండి..
కళ్లు కనురెప్ప వేయడం వల్ల సహజమైన రిఫ్లెక్స్ కు గురవుతాయి. కంటి లోపలంతా తేమగా ఉండి కళ్లు పొడిబారే సమస్య ఉండదు. ఈ సమస్య ఎక్కువగా కంఫ్యూటర్ వర్క్ చేస్తున్నప్పుడు, ఎక్కువ సమయం చదివేటప్పుడు కంటి రెప్పను వేస్తూ ఉండాలి. 20-20-20 నియమాన్ని పాటించడం వల్ల కంటి సమస్య తగ్గుతుంది. ప్రతి 20 సెకన్లకు విరామం తీసుకోవాలి. మనకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూస్తూ ఉండాలి.
స్క్రీన్ టైం ఒత్తిడి తెస్తుంది..
స్క్రీన్ టైం పెరగడం వల్ల కంటిమీద ఒత్తిడి ఉంటుంది. కంప్యూటర్ స్క్రీన్ ని కంటి చూపు మీద ప్రభావం చూపుతుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే ఓవర్ హెడ్ లైటింగ్ లేదా సూర్యకాంతి నుంచి కాంతిని తగ్గించడానికి యాంటీ గ్లేర్ స్క్రీన్ ఫిల్టర్ వాడాలి. ఇది కళ్లు పొడిబారకుండా, కంటి అలసటను తగ్గిస్తుంది.
Health Tips : షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన వేసవి పానీయాలు ఇవే..!
కంటి చుక్కలు..
పొడి కంటి సమస్య ఉన్నవారి కోసం ఉపయోగించే ప్రిజర్వేటివ్ రహిత కంటి చుక్కల మీద ఎక్కువ ఆధారపడకుండా ఉండాలి. సహజమైన పద్దతుల ద్వారానే కంటి సమస్యను పోగొట్టుకోవాలి. మంచి ఆహారం తీసుకోవడం, మంచి జీవన శైలి అలవాట్లతో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - May 02 , 2024 | 02:05 PM