Hair Tips : చుండ్రు నుంచి విముక్తి పొందాలంటే.. లవంగం నూనెను ట్రై చేయండి!
ABN, Publish Date - May 14 , 2024 | 04:40 PM
లవంగం నూనె చేయడానికి తాజా లవంగాలను ఉపయోగించాలి. ముందుగా సగం లవంగాన్ని మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి బాదం నూనెను తక్కువ మంటపై వేడి చేయాలి.
వేసవిలో వేడి, ఉక్కపోత, చెమట కారణంగా జుట్టు పేలవంగా, జిడ్డుగా మారుతుంది. లవంగం నూనెతో ఈ సమస్యను దూరం చేయవచ్చు. లవంగం నూనెను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఎలాఉపయోగించాలో చూద్దాం.
వేసవిలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యల గురించి...
లవంగాలు మంచి పోషకాలతో నిండి ఉంటాయి. లవంగ నూనెను ఉపయోగించడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్నాయి ఇవి చుండ్రును తొలగిస్తాయి. జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తాయి. లవంగం నూనె మెరుపుని ఇస్తుంది. ఈ నూనెతో తలకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు పెరుగుతుంది. ఇంకా దీనితో కలిగే ఉపయోగాల విషయానికి వస్తే..
Health Tips : స్మూతీస్లో అరటిపండు ఉపయోగించకపోవడానికి కారణాలేంటి..
జుట్టుకు చాలా రకాల నూనెలను రాస్తూ ఉంటాం. ఈ నూనెలన్నీ తలలోని జిడ్డును తొలగించి మంచి పోషణను జుట్టుకు అందిస్తాయనే ప్రయత్నిస్తాం. అయితే ఎన్ని రకాల ఉత్పత్తులను వాడినా కూడా తలలోని చుండ్రు సమస్య తీరకపోతే మాత్రం ఒక్క నూనె మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదే లవంగం నూనె. దీనితో చుండ్ర ఇబ్బందిని నయం చేయవచ్చు.
లవంగం నూనె ఉపయోగాలు..
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా జుట్టు మూలాలను బలపరుస్తాయి. లవంగం నూనె రాసుకోవడం వల్ల తలలో రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది.
చుండ్రుకు చెక్..
లవంగం నూనె రాస్తే దీనితో చేసే మసాజ్ వల్ల స్కాల్ఫ్ ను హైడ్రేట్ చేస్తుంది. చుండ్రు సమస్య కారణంగా యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు తలపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి.
Summer Drinks : వేసవి తాపాన్ని అధిగమించడానికి వీటితో చేసే షర్భత్ తాగితే చాలు..!
జుట్టును ఒత్తుగా..
లవంగం నూనెతో ఒత్తు జుట్టు మీ సొంతం. ఇది మూలాల్లోకి వెళ్ళి కుదుళ్లను బలవంతంగా మారుస్తుంది. దీనితో ఆరోగ్యంగా, నెమ్మదిగా పెరుగుతుంది జుట్టు..
ఈ నూనెను ఎలా తయారు చేయాలి..
లవంగం నూనె చేయడానికి తాజా లవంగాలను ఉపయోగించాలి. ముందుగా సగం లవంగాన్ని మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి బాదం నూనెను తక్కువ మంటపై వేడి చేయాలి. నూనె వేడి అయ్యాకా అందులో లవంమగాల పొడి వేయాలి లంగాల పొడి నూనెలో బాగా మిక్స్ చేయి మరిగేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కంటైనర్లో భద్రపరుచుకుంటే సరి. ఒకసారి తయారు చేసుకున్న నూనెను వారం పాటు వాడుకోవచ్చు.లవంగం నూనె రాయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. తక్కువ మోతాదులో ఈ నూనెను రాయాలి. మరీ ఎక్కుగా రాస్తే చికాకు కలుగుతుంది.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - May 14 , 2024 | 05:01 PM