Apricot Juice : వేసవిలో మారేడు జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ?
ABN, Publish Date - Apr 24 , 2024 | 04:15 PM
మారేడు కాయ చూసేందుకు గట్టిగా అచ్చం వెలగ పండును పోలి ఉంటుంది. కాయగా ఉన్నప్పుడు వగరు, పులుపు రుచితో ఉంటుంది. అదే పండుగా మారాకా మాత్రం కొద్దిగా పులుపుగా ఉంటుంది. దీనితో చేసే షర్బత్ తాగడం వల్ల అతిసార వ్యాధి తగ్గుతుంది. మారేడు రసంలో అల్లం నూరి కలిపి తీసుకుంటే ఇది రక్తంలోని ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
మారేడు చెట్టు.. మన హిందూ సాంప్రదాయాలలో, పూజలలో మారేడు చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. మారేడు ఆకులను అత్యంత భక్తితో శివుణ్ణి కొలుస్తాం. మహా శివునికి ప్రీతికరమైన మారేడు చెట్టులో మనకు తెలియని అద్భుత ఔషధగుణాలు కలిగి ఉంది. మారేడు పండ్లను పెద్దగా ఉపయోగించం కానీ మారేడు పండులో చాలా పోషకాలున్నాయి. కాకపోతే ప్రత్యేకించి వేసవిలో మారేడు పండ్లతో చేసిన షర్బత్ తాగితే మంచి ఫలితాలుంటాయి. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు మంచిది.
మారేడు పండు షర్బత్ మంచి రుచితో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్ సి, రిబోఫ్లావిన్, బీటా కెరోటిన్లు ఇందులో ఉన్నాయి. మారేడు షర్బత్ ని అన్ని కాలాలో కంటే వేసవి కాలంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్దకం సమస్యని తగ్గించుకోవచ్చు.
మారేడు కాయ చూసేందుకు గట్టిగా అచ్చం వెలగ పండును పోలి ఉంటుంది. కాయగా ఉన్నప్పుడు వగరు, పులుపు రుచితో ఉంటుంది. అదే పండుగా మారాకా మాత్రం కొద్దిగా పులుపుగా ఉంటుంది. దీనితో చేసే షర్బత్ తాగడం వల్ల అతిసార వ్యాధి తగ్గుతుంది. మారేడు రసంలో అల్లం నూరి కలిపి తీసుకుంటే ఇది రక్తంలోని ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దీనిని షుగర్ వ్యాధిని తగ్గేందుకు కూడా వాడతారు. నిజానికి మారేడు పండులో కంటే కూడా లేత కాయల్లో ఇంకా ఎక్కువ పోషకాలు ఉంటాయట.
Healthy Food : బియ్యానికి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!
1. అసిడిటి సమస్య ఉన్నవారు మారేడు జ్యూస్ తాగితే మంచి ఉపశమనం ఉంటుంది.
2. రుచితోపాటు చిక్కగా ఉండే మారేడు షర్బత్ ఆరోగ్యాన్ని పెంచుతుంది.
3. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మారేడు జ్యూస్ చక్కగా పనిచేస్తుంది.
Liver Health : కాఫీ తాగి లివర్ కొలెస్ట్రాల్‌కి చెక్ పెట్టండి..!
4. దీనిని వరుసగా తీసుకుంటే శరీరంలో నీరసం తగ్గి, శక్తి పెరుగుతుంది. బలహీనంగా ఉన్నవారికి ఇది మంచి బలాన్నిచ్చే టానిక్ గా పనిచేస్తుంది.
5. అంతే కాదు.. అధిక బరువుతో, ఉబకాయంతో ఇబ్బంది పడేవారికి ఇది చక్కని పరిష్కారం.
6. దీనిని జ్యూస్, షర్బత్ లానే కాదు.. పండు రూపంలో కూడా తీసుకోవచ్చు.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Apr 24 , 2024 | 04:15 PM