Munaga Leaf : రోగనిరోధక శక్తి నుంచి చర్మ ఆరోగ్యం వరకూ.. మునగ ఆకుతో ఎన్ని ప్రయోజనాలో..!
ABN, Publish Date - May 17 , 2024 | 01:36 PM
మునగ ఆకులుMunaga leaf అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిన ితగ్గిస్తుంది. మునగ ఆకులో బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ను ఎదుర్కోవృడంలో సహయపడతాయి. గుండె జబ్బులు, మధుమేహం , క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
భారతీయ వంటకాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మునగ చెట్టు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మొరింగా అని మునగ అని ఎన్ని పేర్లతో పిలిచినా మనకు అలవాటైన ఓ కూరగాయ మాత్రమే కాదు. మునగ ఆకులు Munaga leaf , మునగ కాయలు, మునగ పువ్వులు అన్నీ మన ఆరోగ్యాన్ని పెంచేవే. మునగ ఆకులు ప్రత్యేకించి ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు అందుతాయి. ఇందులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మంచి ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తాయి.
మునగ ఆకులుMunaga leaf అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిన ితగ్గిస్తుంది. మునగ ఆకులో బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ను ఎదుర్కోవృడంలో సహయపడతాయి. గుండె జబ్బులు, మధుమేహం , క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
డయాబెటిస్ ఉన్నవారు రోజంతా శక్తి స్థాయిలు తగ్గకుండా ఉత్సాహంగా ఉండాలంటే మునగ ఆకులు Munaga leaf తీసుకుంటే సరిపోతుంది. మునగ ఆకులలో క్లోరోజెనిక్ యాసిడ్ ఐసోథియోసైనేట్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్నివిటీని మెరుగుపరుస్తాయి. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
Clay Pot Cooking: మట్టి కుండ వంట రుచి, వాసనను పెంచుతుందా? ఎందుకు ఇందులో వంట చేయాలి...!
ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు కూడా మునగ ఆకుMunaga leaf మంచిది. మనగ ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను క్రమబద్ద చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గస్తుంది. బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి జీర్ణ సమస్యలను నివారిస్తుంది.
ఆకులను జ్యూస్, ఫ్రైలు, పప్పులో కలిపి తీసుకోవచ్చు. ఈ ఆకులను చిన్న మాత్రలుగా మింగుతారు. లేదంటే ఇవి కొన్ని చోట్ల ట్యాబ్లెట్స్ రూపంలోనూ దొరుకుతున్నాయి. మునగ ఆకు వాపు, నొప్పులను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.ప్రోటీన్లు రక్తంలో చెక్కర స్థాయిని తగ్గిస్తుంది. బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కీళ్ల నొప్పులు, గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్, ఆర్థరైటిస్, అధిక రక్త పోటు, ఔషధాల వల్ల కాలేయం దెబ్బతినడం, కడుపు పూతలు, ఆస్తమా, గాయం మానేందుకు సహాయపడుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - May 17 , 2024 | 01:37 PM