Women Health : గర్భిణీలకు ఎంత సమయం నిద్ర కావాలి.. సరైన నిద్ర లేకపోతే.. !
ABN, Publish Date - Jul 12 , 2024 | 01:39 PM
నిద్ర సరిగా లేకపోతే గర్భీలలో చాలా సమస్యలు తలెత్తుతాయి. దాదాపు 79 శాతం గర్భిణీ స్త్రీలు నిద్ర సమస్యలను ఎదుర్కొంటారు. గర్భధారణ సమయంలో నిద్ర సమరీగాలేకపోవడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, మూర్చలు, నెలలు నిండ కుండానే పుట్టడం, వంటివికలుగుతాయి.
మనిషికి నిద్ర చాలా అవసరం. దాదాపు 8 నుంచి 9 గంటల నిద్ర లేకపోతే రోజంతా పని చేయలేని పరిస్థితి ఉంటుంది. శరీరం మరీ అంత ఉత్సాహంగా ఉండదు. కాబట్టి శరీరం విధులను నిర్వహించడానికి సరిపడా నిద్ర అవసరం. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే.. చాలామందిలో నిద్ర సమస్యలుంటాయి. గర్భిణీ స్త్రీలలో నిద్ర పట్టకపోవడం అనేది సాధారణంగా ఉండే సమస్యే. ఇదంతా గర్భిణీ స్త్రీలలో హార్మోన్లు, ఆందోళన, శారీరక మార్పుల కారణంగా నిద్ర సమస్యలను ఎదుర్కొంటారు. నిద్రా భంగం చాలా మంది గర్భిణీ స్త్రీలను ప్రభావితం చేస్తుంది.
సరైన నిద్ర లేకపోతే..
నిద్ర సరిగా లేకపోతే గర్భీలలో చాలా సమస్యలు తలెత్తుతాయి. దాదాపు 79 శాతం గర్భిణీ స్త్రీలు నిద్ర సమస్యలను ఎదుర్కొంటారు. గర్భధారణ సమయంలో నిద్ర సమరీగాలేకపోవడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, మూర్చలు, నెలలు నిండ కుండానే పుట్టడం, వంటివికలుగుతాయి. హార్మోన్ల మార్పులు, ఆందోళన, యాసిడ్ రిఫ్లక్స్, స్లీప్ అప్నియా, కాలు తిమ్మిరి, వెన్నునొప్పి వంటివి మరిన్ని సమస్యలకు కారణం కావచ్చు.
Super Food : రాగులతో బరువు తగ్గడం సులువే.. దీనితో ఇంకా బోలెడు లాభాలు..!
హార్లోన్ల మార్పులు, ఆందోళన, యాసిడ్ రిఫ్లక్స్...
స్థిరమైన నిద్ర.. ప్రతిరోజూ నిద్రపోయేందుకు ఒకే సమయాన్ని సెట్ చేసుకోవాలి.
నిద్ర.. టీవీ చూడటం, ల్యాప్ టాప్ లో వర్క్ చేయడం వంటివి నిద్ర పోయే సమయంలో చేయకపోవడం మంచిది.
కెఫీన్.. కెఫీన్, చాక్లెట్స్ వంటివి నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.
Super Snacks : వర్షాకాలం ఈ స్నాక్స్ తింటే.. రుచే కాదు ఆరోగ్యం కూడా..!
ఆందోళన.. నిద్ర సమస్యల కారణంగా ధ్యానం, వ్యాయామం వంటి రిలాక్సేషన్ టెక్నిక్ మంచి నిద్రను ఇస్తాయి.
మసాజ్ టెక్నిక్స్.. వెచ్చగా స్నానం, మసాజ్ వంటిని శరీరానికి మంచి విశ్రాంతిని ఇస్తాయి.
స్క్రీన్ సమయం తగ్గించాలి. ఎలక్ట్రానికి పరికరాలను నిద్రకు ముందు చూడకపోవడమే మంచిది. కనీసం ఒక గంట ముందు స్క్రీన్ కు దూరంగా ఉండాలి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 12 , 2024 | 01:39 PM