Weight Loss : ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బరువు తగ్గడంలేదా.. ఇలా చేసి చూడండి..!
ABN, Publish Date - May 24 , 2024 | 01:58 PM
నలుగురిలో చలాకీగా తిరిగేందుకు ఇబ్బంది పెడుతుంది. దీనిని వదిలించుకోవాలని నోరు కట్టుకుని ఆహారం విషయంలోనూ, బరువు తగ్గే వీలుగా వ్యాయామం చేయడం మొదలు పెట్టి శ్రమపడుతున్నా కూడా ఫలితం పెద్దగా ఉండదు.
బరువు తగ్గడం అనేది చాలా పెద్ద సమస్యగా ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్న సమస్య.చెడు జీవనశైలి అలవాట్లకారణంగా ఊబకాయం సమస్య వస్తుంది. బరువు పెరగడం దీనితో అనేక వ్యాధులకు గురి కావడం ఉంటుంది. ఈ ఊబకాయం కారణంగా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
బరువు సమస్య నలుగురిలోనూ చిన్నబోయేలా చేస్తుంది. ఆత్మన్యూన్యతను పెంచుతుంది. నచ్చిన దుస్తులను వేసుకునే స్వేచ్ఛ ఉండదు. నలుగురిలో చలాకీగా తిరిగేందుకు ఇబ్బంది పెడుతుంది. దీనిని వదిలించుకోవాలని నోరు కట్టుకుని ఆహారం విషయంలోనూ, బరువు తగ్గే వీలుగా వ్యాయామం చేయడం మొదలు పెట్టి శ్రమపడుతున్నా కూడా ఫలితం పెద్దగా ఉండదు. ఇందుకు కారణాలు కూడా మనకు సరిగా తెలియవు. అసలు ఎందుకు బరువు తగ్గడంలేదు అనే అనుమానం వస్తే మాత్రం ఇలాంటి పరీక్షలు చేయించుకోవాలి. అవేమిటంటే..
ఎందుకు బరువు తగ్గరు..
బరువు తగ్గాలనే విషయంగా వ్యాయామాలు, డైటింగ్ కూడా చేస్తారు. కానీ ఎలాంటి ఫలితం ఉండదు. బరువు తగ్గకపోవడం గురించి కొన్ని రక్తపరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.
రోగనిరోధక శక్తి నుంచి చర్మ ఆరోగ్యం వరకూ.. మునగ ఆకుతో ఎన్ని ప్రయోజనాలో..!
వాపు..
వాపు కూడా బరువు తగ్గడంలో ఇబ్బంది కలిగిస్తుంది. శరీరంలో మంట సమస్యను గుర్తిండానికి, సి - రియాక్టివ్ ప్రోటీన్ (CRP) పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
విటమిన్ డి..
శరీరంలో విటమిన్ డి లోపం కూడా బరువు తగ్గడంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకపోతే కనుక విటమిన్ డి పరీక్ష చేయించుకోవాలి.
థైరాయిడ్ కారణం..
థైరాయిడ్ కారణంగా కూడా శరీరం అధిక బరువును ఎన్ని ప్రయత్నాలు చేసినా వదుల్చుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా T3, T4, TSHకి సంబంధించిన రక్త పరీక్షలు చేయించుకోవాలి.
మట్టి కుండ వంట రుచి, వాసనను పెంచుతుందా? ఎందుకు ఇందులో వంట చేయాలి...!
షుగర్ వ్యాధి..
రక్తంలో చక్కెర నియంత్రణలో లేని కారణంగా బరువు తగ్గడం కష్టంగా మారుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలియాలంటే హెచ్‌బీఏ1సీ టెస్ట్ తప్పనిసరి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - May 24 , 2024 | 01:58 PM