Women Health : మోనోపాజ్ తర్వాత మహిళల్లో బోలు ఎముకల వ్యాధి పెరుగుతోందా..!
ABN, Publish Date - Jul 10 , 2024 | 02:53 PM
కాల్షియం లేకపోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి.
పిరియడ్స్ రావడం ఆగిపోయిన, మోనోపాజ్ కి దగ్గర అవుతున్న స్త్రీలలో కాల్షియం తగ్గిపోవడం, ఇతర సమస్యలతో బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటోంది. దీనికి పరిష్కారంగా కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం, అలాగే కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవడం చేస్తూ ఉండాలి. ఇంకా సమస్య పెద్దది కాకమునుపే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
స్త్రీలలో 45 నుంచి 55 సంవత్సరాల వయస్సు వచ్చినపుడు మోనోపాజ్ దశకు చేరుకుంటారు. అంటే స్త్రీలలో అప్పటి వరకూ వచ్చిన బుుతుక్రమం ఆగిపోతుంది. దీని కారణంగా శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. పిరియడ్స్ సమయంలో శరీరంలో ఈస్ట్రోడెన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది పిరియడ్స్ ఆగిపోయినప్పుడు ఈస్ట్రోజెన్ శరీరంలో తగ్గుతుంది. ఈ కారణంగా హార్మోర్ల ఉత్పత్తి తగ్గడం, ఆహారంలో కాల్షియం తాయారు చేసే తగ్గిపోవడం దీనితో ఎముకలు క్రమంగా బలహీనపడతాయి. దీనికోసం ఏం చేయాలంటే..
కాల్షియం లేకపోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి. కాల్షియం అనేది శరీరంలో లభించే పోషకం. కాల్షియం అనేది శరీరంలో లేకపోవడం వల్ల ఎముకలు బలహీన పడతాయి. మోనోపాజ్ తర్వాత స్త్రీ శరీరంలో కాల్షియం లోపం ఉండకుండా చూసుకోవాలి.
Drinking Hot Water : వేడి నీటిని తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలా..
కాల్షియం తగ్గితే..
ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలకు సంబంధించిన వ్యాధి. ఈ స్థితిలో, ఎముకలు బలహీనంగా మారతాయి. విరిగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఈ సమస్యను ఎదుర్కోవాలంటే సరైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే డాక్టర్ సలహామేరకు సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా ముఖ్యం. ఎముకలకు సంబంధించిన సమస్యలను నివారించడానికి 19 నుంచి 70 సంవత్సరాల వయస్సు కలిగిన స్త్రీలు 1000,2000 MG కాల్షియం రోజువారీ తీసుకోవడం మంచిది. కాల్షియంతో పాటు శరీరంలో విటమిన్ డి లోపాన్ని కూడా గుర్తించి తగిన విధంగా దీనిని భర్తీ చేయాలి.
కాల్షియం అధికంగా ఉండే పాలు, చీజ్, ఆహారాలు, బ్రోకలీ, క్యాబేజీ, బెండకాయలు, సోయా బీన్స్, చేపలు, కాల్షియాన్ని అందిస్తాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 10 , 2024 | 02:54 PM