Navya : ఆఫీస్ యోగా
ABN, Publish Date - May 19 , 2024 | 03:19 AM
వేగంగా మారుతున్న ప్రపంచం, మారుతున్న జీవన విధానంతో పాటు, ఉద్యోగాల సరళి కూడా మారిపోతోంది. ఎక్కువగా కంప్యూటర్ తెర ముందు గంటల పాటు కదలకుండా కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగాలే కనిపిస్తున్నాయి.
వేగంగా మారుతున్న ప్రపంచం, మారుతున్న జీవన విధానంతో పాటు, ఉద్యోగాల సరళి కూడా మారిపోతోంది. ఎక్కువగా కంప్యూటర్ తెర ముందు గంటల పాటు కదలకుండా కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగాలే కనిపిస్తున్నాయి. అన్నేసి గంటల పాటు ఒకే భంగిమలో కదలకుండా కూర్చోవలసి రావడం వల్ల కొన్ని నొప్పులు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. దీనికి డాక్టర్ల దాకా వెళ్లకుండా... ముందు జాగ్రత్తలు, చిట్కాలు ఏమైనా ఉన్నాయా అంటే... అవునని చెబుతోంది. భారతీయ యోగా.
ఆఫీస్ కుర్చీలో కూర్చుని ఉండగానే ఒక ఐదు నిమిషాలు శరీరాన్ని చిన్న యోగా భంగిమల్లో సాగదీయడం ద్వారా... ఎక్కువ సమయం కూర్చుని ఉండటం వల్ల కలిగే ఇబ్బందులను అధిగమించవచ్చు.
ఆ యోగాసనాలు
1. కూర్చుని చేసే తాడాసనంతాడాసనం అంటే మొత్తం శరీరాన్ని పాదాల మునివేళ్లమీద నిలబెట్టి సాగదీయడం. ఇపుడు నిలబడవలసిన అవసరం లేకుండా, కుర్చీలో కూర్చుని, రెండు చేతులను పైకెత్తాలి. శరీరాన్నిపై వైపు కొన్ని సెకన్ల పాటు సాగదీయాలి.(స్ట్రెచ్)
2. కూర్చుని ముందుకు వంగాలి. రెండు చేతులను చెవుల పక్కనుండి సాధ్యమైనంత పైకి సాగదీయాలి. .అలాగే కుర్చీలో కూర్చుని, తలను మోకాళ్ల దాకా తీసుకు రావాలి.
3. మార్జాలాసనం కూర్చుని ముందుకు వంగకుండా శరీరాన్ని పిల్లి మాదిరిగా... వెన్నెముక ముందుకు వంచకుండా సాగదీయాలి. గడ్డాన్ని మోకాళ్ల దాకా తీసుకురావాలి.
4. మెడను అన్ని వైపులా తిప్పడం మెడను ముందుగా గడ్డానికి తగిలేలా వంచి, అక్కడినుంచి భుజాల మీదుగా గుండ్రగా తిప్పడం వల్ల మెడ కండరాలు విశ్రాంతిని పొందుతాయి.
5 చేతులను బాగా ముందుకు చాచి, ఒక చేతితో రెండవ అర చేతిని కొద్దిగా వెనక్కి వంచాలి. దీనివల్ల చాలాసేపు కంప్యూటర్ కీబోర్డు మీద ఒకే భంగిమమలో ఉన్న చేతులు, వేళ్లు విశ్రాంతిని పొందుతాయి.కూర్చున్న చోటనే ఒక్క ఐదు నిమిషాలు ఇవన్నీ చేయడం వల్ల... వెన్ను నొప్పి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.
Updated Date - May 19 , 2024 | 03:39 AM