ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Metabolic Rate : మెటబాలిజం పెరగాలంటే?

ABN, Publish Date - Oct 08 , 2024 | 02:23 AM

మెటబాలిజం వేగం తగ్గితే శరీరంలో క్యాలరీలు పేరుకుపోయి, స్థూలకాయం వేధిస్తుంది. కాబట్టి ఓ పక్క వ్యాయమాలు చేస్తూనే మెటబాలిజంను కూడా పరుగులు పెట్టించే ఆహారాన్ని ఎంచుకోవాలి.

గుడ్ పుడ్

మెటబాలిజం వేగం తగ్గితే శరీరంలో క్యాలరీలు పేరుకుపోయి, స్థూలకాయం వేధిస్తుంది. కాబట్టి ఓ పక్క వ్యాయమాలు చేస్తూనే మెటబాలిజంను కూడా పరుగులు పెట్టించే ఆహారాన్ని ఎంచుకోవాలి.

మెటబాలిజం పెరగాలంటే ప్రొటీన్లు ఎక్కువగా, కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్లు పరిమితంగా, మంచి కొవ్వులు తక్కువగా తీసుకోవాలి. అందుకోసం....

  • ప్రొటీన్‌: గుడ్లు, లేత మాంసం (చికెన్‌, టర్కీ), చేపలు, సోయా, టోఫు, పప్పుధాన్యాలు తినాలి.

  • కాంప్లెక్స్‌ కార్బ్స్‌: పాలిష్‌ పట్టని గోధుమలు, రోల్డ్‌ ఓట్స్‌, మిల్లెట్లు, పాలిష్‌ పట్టని బియ్యం, చిలకడ దుంపలు, తీపి మొక్కజొన్న తినాలి.

  • మంచి కొవ్వులు: కొబ్బరి నూనె, సీడ్స్‌, నట్స్‌, అవకాడొ అలాగే రోజుకు కనీసం మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి. అలాగే మెటబాలిజంను పెంచే ఇంకొన్ని చిట్కాలను కూడా పాటించాలి. అవేంటంటే...

  • మెటబాలిక్‌ రేట్‌ను నిద్ర కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి 7 నుంచి 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి.

  • మెటబాలికల్‌గా చురుగ్గా ఉండే అవయవాలు కండరాలు. మజిల్‌ మాస్‌ ఎక్కువగా ఉన్న వాళ్లలో మెటబాలిక్‌ రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొవ్వును కరిగించి మజిల్‌ మాస్‌ను పెంచే వ్యాయమాలు చేయాలి.

  • స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలు మెటబాలిజంను పెంచుతాయి.

Updated Date - Oct 08 , 2024 | 02:24 AM