ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Husband Love: భార్య అంటే ఎనలేని ప్రేమ ఉన్న వారు మాత్రమే ఈ పనులు చేస్తారు..

ABN, Publish Date - Nov 12 , 2024 | 03:17 PM

సాధారణంగా మగవారు చేసే కొన్ని పనులు వారికి తమ భార్యలపై కోపం వస్తుందా? రాదా అనే విషయాన్ని స్పష్టం చేస్తాయట. ఇంతకీ భర్తలు చేసే ఆ పనులేంటో తెలుసుకుందాం..

couple

Husband Love: ఏ మనిషికైనా కోపం రావడం సహజం. ఇక భార్యాభర్తలంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరి మీద మరొకరికి చిన్న విషయాలకైనా కోపం వస్తుంది. అయితే, ఆ కోపం ఎక్కువ సేపు ఉండదు. ఎలా వస్తుందో అలాగే వెళ్లిపోతుంది. కానీ, కొందరి విషయాలలో కోపాలు తెగదెంపుల వరకు దారి తీస్తాయి. అయితే, ఎన్ని గొడవలు జరిగినా, ఏ సమస్య వచ్చినా అవి చాలా వరకు పరిష్కారం అవడం అనేది కేవలం భార్యాభర్తలు వాటికి రియాక్ట్ అవ్వడంపైనే ఆధారపడి ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే.. సాధారణంగా మగవారు చేసే మూడు పనులు వారికి తమ భార్యలపై కోపం వస్తుందా? రాదా అనే విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇంతకీ భర్తలు చేసే ఆ మూడు పనులేంటో తెలుసుకుందాం...

1. ప్రేమను వ్యక్తం చేయడం...

చాలా మంది భర్తలకు వారి భార్యలపై బోలెడు ప్రేమ ఉంటుంది. కానీ, అదంతా ఇంట్లోనో లేక పడక గదిలోనో మాత్రమే చూపిస్తుంటారు. కానీ భార్యపై ఉన్న ప్రేమను ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా బయటపెట్టే భర్తలకు వారి భార్యలంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. ఇలాంటి భర్తలకు ఏ మాత్రం భార్యలపై కోపం అనేది కల్లో కూడా ఉండదేమో అన్నంత ప్రేమగా ఉంటారు. నలుగురిలో భార్యపై కోప్పడే మగాడు కాదు.. నలుగురిలో భార్యపై ప్రేమ కురిపించే మగాడిని చూసి భార్య గర్వపడుతుంది. అలాంటి భర్తను భార్య గౌరవిస్తుంది.

2. సమయాన్ని గడపడం..

భార్య కోసం సమయాన్ని వెచ్చించే భర్త దొరకడం చాలా లక్కీ. అలాంటి భర్త ఎప్పుడూ భార్యపై కోపం చేసుకోడు. ఎందుకంటే సమయాన్ని వెచ్చించడంలోనే భార్యపై అతని ప్రేమ వ్యక్తం అవుతుంది. ఇక తన కోసం సమయం కేటాయిచే భర్తంటే భార్యకు కూడా ఎంతో గౌరవం. ఇద్దరూ కలిసి గడిపే సమయంలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరికొకరు మద్దతుగా ఉండటం ఇలా అన్నీ వారి బంధాన్ని బలంగా మారుస్తాయి.

3. సహాయం..

అన్ని పనులు అందరూ చేయవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకుంటారో అలాంటి భర్తలు భార్యలపై అస్సలు కోపగించుకోరట. పనిని జెండర్ ఆధారంగా విభజించకుండా భార్యకు సహాయం కూడా చేస్తారట. ముఖ్య విషయం ఏమిటంటే భర్తలు సహాయం చేస్తే వారి భార్యలు చాలా సంతోషిస్తారు. భర్తలకు అనుగుణంగా ఉంటూ..భర్తలకు కోపం తెప్పించే పనులు భార్యలు అస్సలు చెయ్యరు.

Updated Date - Nov 12 , 2024 | 03:17 PM