ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Parvathy Vinod : అలంకరణ చేపలతో ఆదాయం...

ABN, Publish Date - Nov 04 , 2024 | 04:57 AM

అలంకరణ చేపలతో ఆదాయం ఆర్జించవచ్చనే ఆలోచనే వినూత్నమైనది. అయినా ఆ వ్యాపారాన్ని ఒక సవాలుగా స్వీకరించడమే కాకుండా, నెలకు అర లక్షకు పైగా లాభాలను ఆర్జించే స్థాయికి ఎదిగింది కేరళకు చెందిన పార్వతి వినోద్‌. చేపల పెంపకంలో పద్దెనిమిదేళ్ల ప్రస్థానాన్నీ, అనుభవాలనూ ఇలా వివరిస్తోంది.

వినూత్నం

అలంకరణ చేపలతో ఆదాయం ఆర్జించవచ్చనే ఆలోచనే వినూత్నమైనది. అయినా ఆ వ్యాపారాన్ని ఒక సవాలుగా స్వీకరించడమే కాకుండా, నెలకు అర లక్షకు పైగా లాభాలను ఆర్జించే స్థాయికి ఎదిగింది కేరళకు చెందిన పార్వతి వినోద్‌. చేపల పెంపకంలో పద్దెనిమిదేళ్ల ప్రస్థానాన్నీ, అనుభవాలనూ ఇలా వివరిస్తోంది.

‘‘నేను సోషియాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాను. వివాహమైనతరవాత కేరళలోని కొల్లాం వచ్చేనాటికి నాకు చేపల గురించి అసలు ఏమీ తెలియదు. కానీ మా అత్తగారి కుటుంబమంతా చేపల పెంపకం, వ్యాపారాల్లో అనుభవజ్ఞులు. ప్రతిరోజూ ఈ వ్యవహారాలు చూస్తుండడంతో క్రమంగా నాకు కూడా ఆసక్తి మొదలైంది. చేపల పెంపకంలో మెలకువలు నేర్చుకోవాలనుకున్నాను. అందుకు నాకు కొన్నేళ్లు పట్టింది. ఒక్కోసారి చెరువులో పెంచుతున్న చేపలన్నీ చనిపోయేవి. ఆర్థికంగా నష్టపోయేవాళ్లం. అప్పుడే ఇది చాలా కష్టమైన పనని నాకర్థమైంది. అయినా నేర్చుకోవాలన్న తపనతో పట్టుదలతో చాలా విషయాలు తెలుసుకున్నాను.

  • గుప్పి, ఏంజిల్‌, కోయ్‌ కార్ప్‌

మాకు ఎనిమిది చేపల చెరువులు ఉండేవి. వీటిలో ఆహారంగా ఉపయోగించే చేపలతోపాటు అలంకరణ కోసం అక్వేరియంలో ఉంచే చేపలను కూడా పెంచేవాళ్లం. గుప్పి, ఏంజిల్‌, కోయ్‌ కార్ప్‌ వంటి అలంకరణ చేపలు త్వరగా చేతికంది వచ్చేవి. వీటి పెంపకంలో రిస్క్‌ తక్కువగా ఉండేది. దీంతో ఈ అలంకరణ చేపల వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలని మావాళ్లకి సూచించా! మొదట ఇంట్లోనే గదుల్లో కొన్ని చేపలను పెంచడం ప్రారంభించాను. తరవాత సిమెంట్‌ ట్యాంక్‌లు, గ్లాస్‌ ట్యాంక్‌లు నిర్మించుకున్నాం.


తర్వాత ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్‌ కింద కొంత రుణం తీసుకొని మొత్తం పదిహేను లక్షల పెట్టుబడితో మూడేళ్ల కిందట కొల్లాంలో ‘దేవూస్‌ ఆక్వాఫామ్‌’ అనే హేచరీని ప్రారంభించాం. ఈ హేచరీలో వివిధ రకాల సైజుల్లో 21 సిమెంట్‌ ట్యాంకులు, 150 గ్లాస్‌ ట్యాంక్‌లు ఉన్నాయి. వీటితో పాటు, బయట వేర్వేరు ప్రదేశాల్లో మరో ఏడు ట్యాంక్‌లు ఉన్నాయి. సిమెంట్‌ ట్యాంక్‌ల్లో ఒక్కోదానిలో లక్ష వరకు కోయ్‌ కార్ప్‌ చేప పిల్లలను, గ్లాస్‌ ట్యాంక్‌ల్లో ఒక్కోదానిలో అయిదు వందల వరకు ఏంజిల్‌ ఫిష్‌ చేప పిల్లలను పెంచుతున్నాం. వీటితోపాటు మార్ఫ్‌, క్రిబిన్‌సిస్‌, జులిడోక్రోమిస్‌, బుటికాఫురీ, ఫ్రంటోసా, జేబ్రాడానియస్‌, రెయిన్‌బో సిఛైల్డ్‌, హెకెల్లీ, మూన్‌లైట్‌ గౌరమీ వంటి అరుదైన అలంకరణ చేపలనూ పెంచుతున్నాం. అంతేకాదు ఈ హేచరీలో ఔత్సాహికులకు శిక్షణ కూడా ఇస్తున్నాం.

  • ట్యాంక్‌ల నిర్వహణ కష్టం

ట్యాంక్‌ల్లో అలంకరణ చేపలను పెంచేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క చేప చనిపోయి కనిపించినా దానిని వెంటనే తీసివేయాలి. ట్యాంక్‌ నీటిలో చేపలు వదిలిన వ్యర్థాలను, మిగిలిన ఆహారాన్ని ట్యూబ్‌ల సహాయంతో తీసివేయాలి. లేనిపక్షంలో నీటిలో అమ్మోనియా గ్యాస్‌ విడుదలై చేపలు చనిపోతాయి. తొట్టిని పరిశుభ్రమైన నీటితో నింపిన తరవాతనే చేపలకు ఆహారాన్ని వేయాలి. తొట్టి బాగా మురికిగా మారినపుడు చేపలన్నింటినీ మరో తొట్టిలోకి మార్చాల్సి ఉంటుంది. మొదట్లో ఇది చాలా కష్టంగా అనిపించేది. దీనికే చాలా సమయం పడుతూ ఉంటుంది.


  • గోల్డ్‌ ఫిష్‌కే డిమాండ్‌...

కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ను అనుసరించి వైవిధ్యమున్న చేపలను అందించాల్సి ఉంటుంది. గోల్డ్‌ఫిష్‌, ఫైటర్‌, ఏంజిల్‌, గుప్పి చేపలకు డిమాండ్‌ ఉన్నప్పటికీ కొత్తవాటి గురించి అడుగుతుంటారు. ఎప్పుడూ పాత రకాలనే మార్కెట్లోకి పంపితే ఒక్కోసారి నష్టపోక తప్పదు. వ్యాపారమన్నాక ఒడిదొడుకులు సహజం. ప్రస్తుతం గోల్డ్‌ ఫిష్‌, కియోకార్ప్‌ రకాల చేపలకు ఆదరణ ఎక్కువగా ఉంది. వీటి ఉత్పత్తిని ఏడాదికి మూడు లక్షల నుంచి అయిదు లక్షల వరకు పెంచాం. కియోకార్ప్‌ ధర అంగుళానికి రూపాయిన్నర, బనానా మార్ఫ్‌ ధర రెండు అంగుళాలకు నలభై రూపాయలు, బ్లూ మార్ఫ్‌ ధర రెండు అంగుళాలకు ఇరవై రూపాయలు, ఎర్రని కళ్లున్న అల్బినో క్రిబెన్‌సిస్‌ ధర ఒక్కోటి అయిదు వందలకు అమ్ముడుపోతున్నాయి. చేపల ఆహారానికి నెలకు 20 వేలు, విద్యుత్తుకు ఐదు వేలు ఖర్చవుతాయి. మెడిసిన్స్‌, బ్రూడ్‌స్టాక్‌ ఖర్చులు అదనం. అన్నీ పోను ఒక్కోసారి అత్యధికంగా లాభపడతాం. మరోసారి ఏమీ మిగలదు. ప్రస్తుతం ఇళ్లలో, కార్యాలయాల్లో వాస్తుప్రకారం అక్వేరియం పెట్టుకోవడం మంచిదనే అభిప్రాయం ఉంది. దీనివల్ల రకరకాల చేపలకు డిమాండ్‌ పెరుగుతోంది. అందుకే అయిదు, ఆరు, పది సెంటీమీటర్ల సైజున్న ఫిష్‌ పాండ్లను రూపొందించే ఆలోచనలో ఉన్నా. అన్ని పెంపుడు జంతువుల మాదిరిగానే ఈ చేపలు కూడా మనతో బంధాన్ని ఏర్పరచుకుంటాయి. వీటితో సమయం గడపడం మనసుకి అహ్లాదాన్నిస్తుంది.


  • శిక్షణనిస్తూ...

మొదట అలంకరణ చేపలను పెంచాలని అనుకున్నపుడు అందరూ నిరుత్సాహపరిచారు. కానీ మా వారు, వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఆయన నుంచే ప్రాథమికంగా చాలా మెలకువలు నేర్చుకున్నా. శాస్త్రీయంగా అవగాహన ఉండాలన్న ఆలోచనతో కేరళ యూనివర్సిటీ ఆఫ్‌ ఫిషరీస్‌ అండ్‌ ఓషన్‌ స్టడీ్‌సలో చేపల పెంపకానికి సంబంధించిన కోర్సు పూర్తిచేశాను. ఈ పరిజ్ఞానంతోనే 2014 నుంచి ఫిషరీస్‌ స్కూళ్లు, కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తున్నా. నా అనుభవాలను విద్యార్థులతో పంచుకోవడం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది.

Updated Date - Nov 04 , 2024 | 04:57 AM