ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

healthy lifestyle: ఆరోగ్యమే అసలు రహస్యం

ABN, Publish Date - Dec 21 , 2024 | 03:28 AM

హాస్యభరిత చిత్రం ‘జవానీ జానేమన్‌’తో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది అలయ. ఆమె తల్లి పూజా బేడీ కథానాయికగా పలు చిత్రాల్లో అలరించారు.

వెండితెరపై అలరిస్తున్న మరో వారసురాలు... అలనాటి తార పూజా బేడీ కూతురు... అలయా ఇబ్రహీమ్‌ ఫర్నిచర్‌వాలా. ఉరఫ్‌ అలయా ఎఫ్‌గా సుపరిచితురాలు. చేసింది కొద్ది సినిమాలే అయినా విలక్షణ నటిగా పేరు తెచ్చుకొంది. అభినయంతో పాటు నాజూకైన రూపంతోనూ ప్రత్యేకతను సంతరించుకున్న ఈ భామ... ఇన్‌స్టాలో తరచూ ఫిట్‌నెస్‌ వీడియోలు పెట్టి... ఆరోగ్యవంతమైన జీవన విధానం దిశగా అభిమానులను ప్రోత్సహిస్తోంది.

హాస్యభరిత చిత్రం ‘జవానీ జానేమన్‌’తో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది అలయ. ఆమె తల్లి పూజా బేడీ కథానాయికగా పలు చిత్రాల్లో అలరించారు. ప్రముఖ నటుడు కబీర్‌బేడీ ఆమెకు తాత. ఫర్హాన్‌ ఇబ్రహీమ్‌ ఫర్నిచర్‌వాలాతో వివాహం తరువాత పూజా బేడీ అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే అలయ జన్మించింది. పరిశ్రమలోకి రాకముందు ఆమె ముంబయి ‘జమునాబాయి నర్సీ స్కూల్‌’లో చదివింది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో... అలయకు చిన్నప్పటి నుంచే నటి కావాలనే కోరిక బలపడింది. దానికోసమే ‘న్యూయార్క్‌ ఫిలిమ్‌ అయాడమీ’కి వెళ్లి నటనలో డిప్లమా చేసింది. ఆ క్రమంలోనే తెరపై తన పేరును అలయ ఎఫ్‌గా మార్చుకుంది. కథక్‌ నాట్యంలో కూడా శిక్షణ తీసుకన్న అలయ... 2011లో అమ్మతో కలిసి ఓ రియాలిటీ షోలో పాల్గొంది. 2020లో ఆమె తొలి చిత్రం ‘జవానీ జానేమన్‌’ విడుదలైంది. సైఫ్‌ అలీఖాన్‌ హీరో. చక్కని నటనతో ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. మొదటి సినిమానే అయినా కెమెరా ముందు అలయ ఎంతో సహజంగా కనిపించిందనేది విశ్లేషకుల మాట. ‘బెస్ట్‌ ఫిమేల్‌ డెబ్యూ’ ఫిలిమ్‌ఫేర్‌ అవార్డు కూడా దక్కించుకుంది. ఇక అక్కడి నుంచి వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ‘ఫ్రెడ్డీ, యూటర్న్‌’తో పాటు ఇటీవల విడదలైన మల్టీస్టారర్‌ ‘బడేమియా చోటేమియా’లో టైగర్‌షరా్‌ఫకు జోడీగా కీలక పాత్ర పోషించింది. పారిశ్రామికవేత్త శ్రీకాంత్‌ బొల్లా జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘శ్రీకాంత్‌’లో హీరో రాజ్‌కుమార్‌రావుతో పోటీపడి నటించింది.

ఐదేళ్ల కెరీర్‌లో ఆరు చిత్రాల్లోనే నటించినా... తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘నైకా, లెన్స్‌కార్ట్‌ వంటి బడా బ్రాండ్‌లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. అటు సినిమాలు, ఇటు ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తోంది ఈ అందాల తార. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు ఇరవై లక్షలమంది ఆమెను ఫాలో అవుతున్నారు. ప్రతి వీడియోకూ లైకులు కనీసం లక్ష దాటతాయి. ఆమె పోస్టు చేసేవాటిల్లో ఎక్కువగా తన ప్రాజెక్టులు, బ్రాండ్‌లతో పాటు ఫిట్‌నెస్‌ వీడియోలు ఉంటాయి. అక్కడ అప్పుడప్పుడూ అభిమానులకు కొన్ని ఫిట్‌నెస్‌ సవాళ్లు కూడా విసురుతుంటుంది. కెరీర్‌కు ఎంతటి ప్రాధాన్యమిస్తుందో... ఆరోగ్యవంతమైన జీవన విధానానికి కూడా అంతే ప్రాధాన్యమిస్తుంది. అదే తన విజయ రహస్యమని, అందుకే తన జీవితంలో వ్యాయామాలు, ఆహార నియమాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తానని చెబుతుంది అలయ.


వ్యాయామాలు ఇలా...

అలయ వ్యాయామాల విషయంలో అస్సలు రాజీపడదు. ఆమె రోజువారీ వర్కవుట్స్‌ చాలా కఠినంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు తనకు తాను కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని చేరుకొనేందుకు కఠోరంగా శ్రమిస్తుంటుంది. వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ పూజా థియా ఆమిన్‌ పర్యవేక్షణలో క్లిష్టమైన యోగాసనాలు కూడా సాధన చేస్తుంది. ఒకవేళ జిమ్‌కు వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే సుదీర్ఘ ఏరోబిక్స్‌ సెషన్‌తో పాటు స్కిప్పింగ్‌తో అదనపు క్యాలరీలు కరిగిస్తుంది.

ఉదయం లేవగానే ముందుగా రన్నింగ్‌, జాగింగ్‌తో కూడిన కార్డియో సెషన్‌

తరువాత పావుగంట కిక్‌బాక్సింగ్‌. దీనివల్ల మెదడు చురుగ్గా పని చేస్తుందనేది అలయ మాట.

సరైన శరీరాకృతి, శరీర దారుఢ్యం కోసం వెయిట్‌ ట్రెయినింగ్‌తో పాటు స్క్వాట్స్‌, సూపర్‌మ్యాన్‌ స్ర్టెచ్‌, లంగెస్‌, ప్లాంక్స్‌, క్రంచెస్‌ తదితర వ్యాయామాలు.

అప్పుడప్పుడూ బంతితో ట్రైనింగ్‌. అంటే బంతిపై కూర్చొని వ్యాయామాలు చేయడం. దీనివల్ల బ్యాలెన్స్‌ బాగా కుదురుతుంది. అయితే ఇలాంటి వ్యాయామాలు నిపుణుల సమక్షంలోనే చేయాలి.

అలయ 90 నిమిషాల తన వర్కవుట్‌ సెషన్‌ను రెండుగా విభజించింది. మొదటి సెషన్‌ ఇండోర్‌లో. అంటే జిమ్‌లో చేసేవి. రెండో సెషన్‌ ప్రకృతి ఒడిలో.

అలయ వర్కవుట్స్‌లో మానసిక వ్యాయామం కూడా ఉంటుంది. రోజూ ధ్యానంతో పాటు ఏదో ఒక పుస్తకంలో పది పేజీలు చదువుతుంది. దీనివల్ల విజ్ఞానమే కాకుండా, సృజనాత్మక శక్తి కూడా పెరుగుతుందని అలయ చెబుతోంది. అంతేకాదు... తన ఆలోచనలన్నిటినీ ఒక కాగితం మీద పెడుతుంది. తన లక్ష్యాలను ఎంతవరకు చేరుకుందో ఏరోజుకారోజు బేరీజు వేసుకొంటుంది.


ఇదీ ఆహారం...

ఆహారం విషయంలోనూ అలయ ఎంతో శ్రద్ధ తీసుకొంటుంది. శరీరం డీహైడ్రేట్‌ కాకుండా రోజుకు నాలుగు లీటర్ల నీళ్లు తాగుతుంది. ఇంటి వంటకే ప్రాధాన్యమిస్తుంది. పోషక విలువలు సమతులంగా ఉండేందుకు మెనూలో రకరకాల సలాడ్స్‌ను జోడించింది.

ఉదయం ఒక బౌల్‌ ఓట్‌మీల్‌తో మొదలవుతుంది. పిండి, పీచుపదార్థాలు ఇందులో పుష్కలం. మంచి శక్తినిస్తుంది. తాజా పండ ్లకు అలయ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అరటిపండు, బెర్రీస్‌, యాపిల్‌ తదితర పండ్లు ఆమె మెనూలో ఉంటాయి. వాటితోపాటు ఆమ్లెట్‌ లేదా బాయిల్డ్‌ ఎగ్‌తో బ్రేక్‌ఫాస్ట్‌. తరచూ గ్రీన్‌ టీ తాగుతుంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్‌ అధికం.

మధ్యాహ్న భోజనంలో పాలకూర సూప్‌, కర్జూర, క్వినోవా పులావ్‌.

రాత్రి పడుకొనే ముందు ఓట్‌మిల్క్‌, నాలుగు బాదంపప్పులు, రెండు అక్రోట్లు, చెంచాడు తేనె, దాల్చినచెక్క, సబ్జాగింజలు, ప్రొటీన్‌ పౌడర్‌తో ప్రత్యేకంగా తయారు చేసిన స్మూతీ.

Updated Date - Dec 21 , 2024 | 03:28 AM