Dry shampoos : డ్రై షాంపూని ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో తెలుసా..!
ABN, Publish Date - Apr 19 , 2024 | 11:33 AM
తలస్నానం తరచుగా చేయడం వల్ల హెయిర్ కలర్ వాడే వారిలో ఫేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
డ్రై షాంపూని వాడేవారిలో హడావుడి జీవన శైలి ఉన్నవారే ఎక్కువ. ఇది సంరక్షణలో భాగంగా మారింది. డ్రై షాంపూలు అని పిలిచినా కూడా ఇవి నిజానికి షాంపూలు కావు.. వాటిలో క్లెన్సింగ్ ఏజెంట్లు ఉండవు. వీటికి బదులు ఇవి అసలు జుట్టుకు వాష్ లేకుండానే శుభ్రం చేసుకునేలా పనిచేస్తాయి. అయితే ఇవి జట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్న వేస్తే.. డ్రై షాంపూతో కలిగే లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.
పొడి షాంపూలతో ప్రయోజనాలు..
1. సాధారణంగా తరచుగా తల స్నానం చేయండి వల్ల జుట్టు పొడి బారిపోయే అవకాశం ఉంటుంది.
2. అదే డ్రై షాంపూ చేసుకోవడం వల్ల సమయం కలిసిరావడమే కాకుండా జుట్టు పొడిబారే సమస్య ఉండదు.
3. తలస్నానం తక్కువగా చేయడం వల్ల జుట్టుకు హాని కలిగించే హెయిర్ డ్రైర్, కర్లింగ్, స్ట్రెయిటెనింగ్ పరికరాలను వాడే పరిస్థితి తగ్గుతుంది.
4. డ్రై షాంపూలు తరచుగా వాల్యూమైజింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇది జుట్టును పొడవుగా ఉంచడంలో సహాయపడుతుంది.
5. తలస్నానం తరచుగా చేయడం వల్ల హెయిర్ కలర్ వాడే వారిలో ఫేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
5. ప్రయాణాల్లో ఉన్న్పప్పుడు ఇవి ఉపయోగపడతాయి.
Health : ఆస్తమాతో బాధపడుతున్నారా? ఈ దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితి గురించి ఉన్న అపోహలేమిటి..!
పొడి షాంపూలతో ప్రతికూలతలు..
1. పొడి షాంపూలను తరచుగా వాడటం వల్ల జుట్టు ముతకబారినట్టుగా మారుతుంది.
2. మితిమీరిన డ్రై షాంపూ ఉపయోగం వల్ల జుట్టును హైడ్రేట్ చేయకుండా సహజ నూనెలను నిరోధించడం, జుట్టును పొడిగా చేస్తుంది. దీనితో జుట్టు మరింత పెళుసుగా మారుతుంది.
3. పొడి షాంపూ వాడకం వల్ల స్కాల్ఫ్ రంధ్రాల్లో వాపు రావచ్చు.
4. ఈ షాంపూకు సువాసన ఉంటే అది చికాకు పెడుతుంది.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Apr 19 , 2024 | 11:33 AM