ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Head bath: రోజు తలస్నానం చేస్తున్నారా.. ఇవి తెలుసుకోండి..

ABN, Publish Date - Dec 10 , 2024 | 09:58 AM

కొంతమంది రోజూ తల స్నానం చేస్తే మరికొంతమంది వారానికి ఒక సారి, రెండ్లుసార్లు చేస్తారు. అయితే, తలంటు స్నానం చేయడానికి మంచి రోజులు ఉన్నాయని మీకు తెలుసా? ఎప్పుడు తలస్నానం చేస్తే మంచిదో ఈ కథనంలో తెలుసుకుందాం..

Head Bath

Head Bath: తల స్నానం చేస్తే ఎంతో అందంగా కనిపిస్తారు. అలా అని ప్రతి రోజూ తలస్నానం చేయడం ఏ మాత్రం మంచిది కాదని ధర్మశాస్త్రం చెబుతుంది. కొంతమంది ప్రతిరోజూ తల స్నానం చేస్తే, మరికొంతమంది వారానికి ఒక సారి, లేదా రెండ్లుసార్లు చేస్తారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ రాత్రి వేళ తలకు నూనె పెట్టేసి మరుసటి ఉదయాన్నే తలస్నానం చేసి ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. అయితే, తలంటు స్నానం చేయడానికి మంచి రోజులు ఉన్నాయని మీకు తెలుసా? పురుషులు ఏయే రోజుల్లో తల స్నానం చేయాలి? స్త్రీలు ఏ రోజు తలస్నానం చేస్తే మంచిదో ఈ కథనంలో తెలుసుకుందాం..

పురుషులు ఈ రోజుల్లో తలస్నానం చేయాలి

*పురుషులు సోమవారం తలంటు స్నానం చేయడం మంచిది. దీన్ని వల్ల వాళ్ళ అందం పెరుగుతుంది. కాబట్టి సోమవారం తల స్నానం చేసేందుకు ప్రయత్నించండి.

*మంగళవారం రోజు పురుషులు తల స్నానం చేయడం మంచిది కాదు. కేవలం మామూలు స్నానం చేయడం మంచిది.

*బుధవారం తల స్నానం చేస్తే పురుషులకు లక్ష్మీ దేవి దీవెనలు లభిస్తాయి. అంతేకాకుండా వారి సంపద కూడా పెరుగుతుంది. ఆదాయం ఎక్కువగా పొందుతారు. కాబట్టి పురుషులు బుధవారం తలస్నానం చేయడం ఉత్తమం.

*గురువారం, శుక్రవారం పురుషులు తలస్నానం చేయకపోవడం మంచిది.

*శనివారం తల స్నానం చేస్తే పురుషులకు మహా భోగం కలుగుతుంది.

*ఆదివారం మగవాళ్లు తలస్నానం చేస్తే తాపంతో పాటు వారికి కోరికలు ఎక్కువగా పెరుగుతాయి.


స్త్రీలు ఈ రోజుల్లో తలస్నానం చేయాలి..

మహిళలు సోమవారం తల స్నానం చేస్తే చాలా మంచిది. అలా చేయడం వల్ల వారు నిత్య సౌభాగ్యంతో ఉంటారని శాస్త్రం చెబుతుంది. బుధవారం తల స్నానం చేస్తే వారి దాంపత్యం ఎంతో సంతోషకరంగా ఉంటుంది. భార్యాభర్తలు ప్రేమానురాగాలతో అన్యోన్యంగా ఉంటారు. మహిళలు శనివారం రోజు తలంటు స్నానం చేయడం చాలా ఉత్తమం. ఆ రోజు తలస్నానం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది. అంతేకాకుండా సత్ఫలితాలు కూడా కలుగుతాయి. అయితే, శుభ కార్యాలు, నెలసరి సమయంలో మాత్రం ఇవి ఏవి స్త్రీలకు వర్తించవు. శుక్రవారం రోజు తలస్నానం చేసి దేవుడికి ఇంట్లో దీపం వెలిగిస్తే మంచిది.

(Note:పై సమాచారం అధ్యయనాల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు. )

Updated Date - Dec 10 , 2024 | 10:35 AM