Story : నిజాయితీకి పరీక్ష
ABN, Publish Date - Jul 29 , 2024 | 11:24 PM
ఒక ఊరిలో రాజారావు అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతని వద్ద ధనయ్య అనే నౌకరు పని చేస్తూ ఉండేవాడు అతనికి ఎంత జీతం ఇచ్చి, మంచిగా చూసుుకున్నా, ఇంకా అసంతృప్తిగా ఉంటూ, ఎపుడు ఇనప్పెట్టె తాళాలు దొరుకుతాయా
ఒక ఊరిలో రాజారావు అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతని వద్ద ధనయ్య అనే నౌకరు పని చేస్తూ ఉండేవాడు అతనికి ఎంత జీతం ఇచ్చి, మంచిగా చూసుుకున్నా, ఇంకా అసంతృప్తిగా ఉంటూ, ఎపుడు ఇనప్పెట్టె తాళాలు దొరుకుతాయా అందులో డబ్బు అంతా తీసుకుని పారిపోదామా అని వేచి చూసేవాడు యజమాని ఇంట్లోచిన్నచిన్న దొంగతనాలు కూడా చేసేవాడు. రాజారావు భార్య ధనయ్యను గవునించి అతని గురించి భర్తకు చేప్పే సమయం కోసం చూస్తోంది. ఈ లోగా ఒక రోజు ధనయ్య రాజారావుతో ‘అయ్యా నేనిక్కడ పని మానేసి, వెళ్లిపోతాను. నేనెంత నమ్మకంగా పని చేసినా, మీరు నన్ను నమ్మడంలేదు లన్నాడు ఆ మాటలకు రాజారావు ‘అదేమిటి ధనయ్యా? నీకు ఈ ఇంట్లో కావలసినంత నమ్మకం స్వేఛ్చ ఉన్నాయి, నా ఇనప్పెట్టె తాళాలు కూడా నేను దాచి పెట్టలేదు. అదిగో ఆ గోడకే తగిలించి ఉన్నాయి. ఇంకా నిన్ను నమ్మక పోవడం ఏమిటి ? అన్నాడు. అది వినన్న ధనయ్య వెంటనే ఏం లాభంఅండి? ఆ తాళం చెవితో పెట్టె తెరుచుకోవడం లేదు అని నోరుజారి, వెంటనే నాలిక కరుచుకున్నాడు. అపుడు రాజారావు‘ నీ బుఽధ్ది గురించి నా భార్య చెబుతున్నా నేను ఇన్ని రోజులు నమ్మలేదు నీకు నీ జీతం ఇస్తున్నాను. ఏమైనా కావాలంటే నన్ను అడగాలి కానీ పెట్టె తాళాలతో నీకేం పనయ్యా? నీ గురించి ఇప్పటికైనా బయట పడింది. నీకు రావలసిన డబ్బు తీసుకుని వెంటనే వెళ్లిపో, నిన్ను పనిలోనుంచి తీసేస్తున్నాను’ అన్నాడు రాజారావు దురాశ వలన మంచి ఉద్యోగం పోయిందే అని తరువాత విచారించాడు ధనయ్య.
Updated Date - Jul 29 , 2024 | 11:24 PM